సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి | Tamil cinema director Atlee and Krishna Priya wedding | Sakshi
Sakshi News home page

సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి

Published Mon, Nov 10 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి

సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి

 వర్ధమాన దర్శకుడు అట్లి, నటి ప్రియల వివాహం ఆదివారం ఉదయం సంప్రదాయ రీతిలో జరిగింది. దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లి రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయం సాధించి చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న అట్లి తన రెండో చిత్రాన్ని ఇళయదళపతి విజయ్ హీరోగా చేయనున్నారు. చాలాకాలంగా బుల్లితెర, వెండితెర నటి ప్రియ, అట్లి ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ జంట ఆదివారం పెళ్లిపీటలె క్కింది. స్థానిక అన్నాశాలైలోని నక్షత్ర హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
 
 దర్శకుడు శంకర్ సతీసమేతంగా విచ్చేసి ఆహుతులకు ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్థలంలో ముందు వరసలో కూర్చొని పెళ్లి వేడుకను ఆద్యంతం తిలకించారు. అనంతరం  వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మధ్య తన చేతులతో మంగళసూత్రాలను తన శిష్యుడు అట్లీకి అందించగా ఆయన వధువు ప్రియ మెడలో మాంగల్య ధారణ చేశారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతోపాటు దర్శకుడు బాలా, నటుడు శివకార్తికేయన్, నాజర్ తదితర పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు చిత్ర ప్రముఖులు తరలి వచ్చి శుభాకాంక్షలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement