Raja Rani Director Atlee and wife Priya announce pregnancy - Sakshi
Sakshi News home page

Atlee- Priya : పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్‌ డైరెక్టర్‌

Published Fri, Dec 16 2022 2:42 PM | Last Updated on Fri, Dec 16 2022 3:11 PM

Raja Rani Movie Director Atlee And Wife Priya Announces Pregnancy - Sakshi

ప్రముఖ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్‌చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్‌. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్‌ చేసింది.

ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అ‍ట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్‌ కాబోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌తో 'జవాన్‌'  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement