మా పెళ్లికి రండి | Director Atlee and Priya Wedding | Sakshi
Sakshi News home page

మా పెళ్లికి రండి

Published Sun, Nov 9 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

మా పెళ్లికి రండి

మా పెళ్లికి రండి

మా పెళ్లికి రండి అంటూ యువ దర్శకుడు అట్లి, ప్రియ చిత్ర ప్రముఖులను ఆహ్వానించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద శిష్యరికం చేసిన అట్లి రాజారాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు తొలి చూపులోనే ప్రేమించిన ప్రేయసి ప్రియను జీవిత భాగస్వామిగా చేసుకోనున్నారు. ప్రియ అనే కృష్ణప్రియ కూడా నటినే. జోడి నెంబర్ 1 అనే టీవీ షోలో పాపులర్ అయిన ఈమె బుల్లితెర నటిగా ప్రాచుర్యం పొందారు.
 
 వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధం అయ్యారు. ఆదివారం ఉదయం స్థానిక అన్నాశాలై రోడ్డులోని హయత్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. సాయంత్రం అదే వేదికపై వివాహ రిసెప్షన్ జరగనుంది. దర్శకుడు అట్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన జీవితంలో అతి ముఖ్యమైన తరుణం దర్శకుడు శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేయడం అన్నారు. రెండో ముఖ్యమైన ఘట్టం రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడమని పేర్కొన్నారు. ఇక మూడో ముఖ్యమైన ఘట్టం ప్రియతో పెళ్లి అని అన్నారు. ప్రియ తనకు నచ్చిన అమ్మాయి మాత్రమే కాదని తనను అర్థం చేసుకున్న మనసుకు దగ్గరైన ఆత్మీయురాలని అట్లీ పేర్కొన్నారు. మనసున్న మనిషి అట్లికి అర్ధాంగి కానుండడం సంతోషంగా ఉందని ప్రియ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement