నైనిక... నీకు తిరుగు లేదిక! | Meena's daughter Nainika makes her debut | Sakshi
Sakshi News home page

నైనిక... నీకు తిరుగు లేదిక!

Published Wed, Apr 13 2016 11:54 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

కుమార్తె నైనికతో మీనా, తెరి చిత్రంలో నైనిక, విజయ్ - Sakshi

కుమార్తె నైనికతో మీనా, తెరి చిత్రంలో నైనిక, విజయ్

బాల తారగా, కథానాయికగా వెండితెరపై మీనా తిరుగు లేదనిపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లికి తగ్గ తనయ అనిపించుకోబోతోంది బేబి నైనిక... డాటరాఫ్ మీనా. విజయ్ హీరోగా రూపొందిన ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) చిత్రంతో నైనిక బాల నటిగా అడుగుపెట్టింది. చిన్నప్పుడు మీనా లానే ఇప్పుడు నైనిక కూడా అందంగా ఉంది. తల్లి నోట్లో నుంచి ఊడిపడిందని చూసినవాళ్లు అంటు న్నారు. చూపులకే కాదు, నటనలో కూడా తల్లిలానే నైనిక చాలా ట్యాలెంటెడ్ అని ‘తెరి’ యూనిట్ అంటోంది. విజయ్‌కి దీటుగా నైనిక నటించిందని చిత్ర దర్శకుడు అట్లీ కితాబులిచ్చేశారు.

‘తెరి’ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నైనిక... ‘విజయ్ అంకుల్, అట్లీ అంకుల్’ అంటూ యూనిట్ సభ్యులందర్నీ వరసలు కలిపి ధన్య వాదాలు చెప్పి, అందరి మనసులనూ ఆకట్టుకుంది. ఇంతకీ, ‘మీ అమ్మాయి పెద్దయ్యాక హీరోయిన్ అవు తుందా?’ అని మీనాను అడిగితే, ‘‘ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. నైనిక నటిస్తానంటే నేనొద్దనను. నటించనంటే బల వంతం చేయను. ఇప్పటికైతే చదువు మీదే దృష్టి’’ అన్నారు. మొత్తానికి, తల్లికి తగ్గట్లే కూతురు కూడా పేరు తెచ్చుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement