Comedian Vadivelu Movie With Director Suraj As Lead Role In Naasi Sekar - Sakshi
Sakshi News home page

మరోసారి హీరోగా చేయడానికి ఓకే చెప్పిన వడివేలు

Published Mon, Mar 29 2021 10:33 AM | Last Updated on Mon, Mar 29 2021 5:44 PM

Comedian Vadivelu Going To Act As Hero Again  - Sakshi

హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్‌ చేసిన సూరజ్‌ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో స్టార్ట్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారం. సూరజ్‌ డైరెక్ట్‌ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు.

సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్‌సై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి’, ‘తెనాలిరామన్‌ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్‌ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement