Comedian vadivelu
-
కమెడియన్ వడివేలుకు ఒమిక్రాన్? హాస్పిటల్లో చేరిక
ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఓ సినిమా కోసం లండన్ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ మధ్యకాలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే హీరో విక్రమ్, కరీనా కపూర్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు
Court Issues Summons To Comedian Vadivelu: విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని సినీ నటుడు వైగై పుయల్ వడివేలుకు గురువారం ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వడివేలు ఇంట్లో గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాంబరం సమీపంలో రూ .1.93 కోట్లకు 3.5 ఎకరాల స్థలాన్ని విక్రయించి, దానిని ఐటీ లెక్కల్లో చూపించనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వడివేలు కంగుతిన్నాడు. ఈ స్థలం విషయంలో సహచర నటుడు సింగముత్తు తనను మోసం చేసినట్టు ఆరోపిస్తూ.. ఆయన సెంట్రల్ క్రైం బ్రాంచ్‌ను ఆశ్రయించారు.చదవండి: చార్లీ చాప్లిన్‌లా 'ఇస్మార్ట్ బ్యూటీ' 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా సింగముత్తుతో పాటుగా మరికొందరు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది. కాగా విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యా యి. అయితే, ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం పిటిషన్ విచారణకు రాగా, సింగముత్తు తరపు న్యాయవాదులు హాజరై పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నట్లు తమ వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి విక్రయించి, ఇప్పుడేమో సింగముత్తు మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం విచారణకు తప్పక హాజరు కావాలని వడివేలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎగ్మూర్‌కోర్టు న్యాయమూర్తి నాగరాజన్ డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.చదవండి: ‘రిపబ్లిక్’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ పాప్ సింగర్ -
కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్..?
అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్ వడివేలు సరసన ‘నాయ్ శేఖర్ రిటర్న్స్’ అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్ టాక్. సురాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘నాయ్’ అంటే కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టైటిల్ పెట్టారట. శేఖర్ పాత్రను వడివేలు చేయనుండగా ఆయన సరసన కీర్తి నటించనున్నారని భోగట్టా. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్ర ఉందనీ, ఆ పాత్రనే కీర్తీ సురేష్ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. మరి.. వడివేలుకి జోడీగా కీర్తి కనిపిస్తారా? లేక కథకి కీలకంగా నిలిచే పాత్రలో కనబడతారా? అసలు ఈ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ -
మాట తప్పిన ప్రముఖ కమెడియన్
హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్ చేసిన సూరజ్ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. సూరజ్ డైరెక్ట్ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు. సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్సై అరసన్ 23ఆమ్ పులికేసి’, ‘తెనాలిరామన్ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. -
ఆయన ఓ లెజెండ్!
హాస్య నటుడు వడివేలును లెజెండ్‌గా నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆయన నటించకుంటే కత్తిసండై చిత్రం ఉండేది కాదని కూడా అన్నారు. విశాల్ నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనకు జంటగా తమన్నా నటించిన ఈ చిత్రంలో చాలా విరామం తరువాత నటుడు వడివేలు హస్యపాత్రలో నటించారు. మరో హాస్య నటుడు సూరి, జగపతిబాబు, అరుణ్ ఆరోరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మియించిన ఎస్.నందగోపాల్ తన మెడ్రాస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. హిఫ్ హాఫ్ తమిళా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు, ప్రచార చిత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. వడివేలు మాట్లాడుతూ తనని అందరూ చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటిస్తున్నారని అంటున్నారని, నిజం చెప్పాలంటే తనకు గ్యాప్ లేదు, తనకెవరూ ఆఫ్ పెట్టలేరని, తానేప్పూడూ టాపేనని అన్నారు. మంచి కథల కోసమే ఎదురు చూశానని, అలాంటి సమయంలో దర్శకుడు సురాజ్ చెప్పిన కత్తిసండై చిత్ర కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించానని తెలిపారు. తేని నడిగర్సంఘాన్ని మళ్లీ తీసుకొచ్చి దాన్ని వృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న విశాల్ ఈ చిత్రం మరో విజయాన్ని అందిస్తుందని అన్నారు. తరువాత చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ దర్శకుడు సురాజ్ తనకు కథ చెప్పగానే ఇందులో నటించడానికి నటుడు వడివేలు కాల్షీట్స్ తీసుకోండని చెప్పానన్నారు. కథ వినగానే ఇందులో ఆయన నటిస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. వడివేలు ఈ చిత్రంలో నటించడం సంతోషం అన్నారు. తమ కాంబినేషన్లో ఇది మూడో విజయం అవుతుందని అన్నారు. నిజం చెప్పాలంటే వడివేలు నటించకుంటే కత్లిసండై చిత్రం ఉండేది కాదనీ, అలాంటి లెజెండ్‌తో మళ్లీ కలిసి నటించడం సంతోషంగా ఉందని విశాల్ పేర్కొన్నారు.కత్తిసండై వినోదభరిత అంశాలతో కూడిన పూర్తి కమర్శియల్ ఎంటర్టెరుునర్ కథా చిత్రం అని దర్శకుడు సురాజ్ తెలిపారు. -
కమెడియన్ ఫ్యాన్ అంటూ నవ్వుకున్నాక..!
ఓ నిందితుడు తప్పతాగి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను సెన్సెషన్ రౌడీని, నన్ను అరెస్ట్ చేయండి అని అడిగితే.. అక్కడివారు నమ్మకపోగా, నువ్వు తమిళ స్టార్ కమెడియన్ వడివేలు అభిమానిలా ఉన్నాడంటూ నవ్వుకున్నారు. ఓ మూవీలో వడివేలు చేసిన తరహాలోనే ఆ నిందితుడు చేసేసరికి తాము పెద్దగా పట్టించుకోలేదని పోలీసులు చెప్పారు. నిందితుడి మాటతీరు, చెప్పే విషయాలను బట్టి అతడ్ని జోకర్ గా తేలికగా తీసుకున్నామని ఎగ్మోర్ పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగరోజు నన్నాగి నగర్ లో జరిగిన ముగ్గురు యువకుల హత్య కేసులో నిందితుడిని అని సోమవారం రాత్రి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన ఎగ్మోర్ పీఎస్ పోలీసులు కాస్త అప్రమత్తమై.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తన పేరు సంతోష్ కుమార్(28) అలియాస్ నందు అని చెప్పాడు. తాను ప్రస్తుతం మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నానని, ఫ్యామిలీతో కలిసి పుడుపేట నుంచి కన్నాగి నగర్ మురికివాడకు ఈ మధ్య వచ్చామని తెలిపాడు. ఎస్ కలియా అలియాస్ రంజిత్ కుమార్(22), టీ సెబాస్టియన్ అలియాస్ మిల్లర్(20), శక్తివేల్(22) అనే యువకుడు దీపావళి పండుగరోజు కన్నాగి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యారు. ఈ యువకుడు గంజాయి అక్రమ వ్యాపారం చేస్తుంటారని దర్యాప్తులో తేలింది. ఎగ్మోర్ పోలీసులు కన్నాగి నగర్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు సంతోష్ నుంచి రాబట్టిన వివరాలతో ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామని కన్నాగి నగర్ పోలీసులు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి ప్రధాన నిందితుడని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటుమన్నామని కన్నాగి నగర్ పోలీసులు వివరించారు. -
పులికేశి సీక్వెల్‌కు సిద్ధం
తమిళసినిమా; హాస్య నటుడు వడివేలు కథానాయకుడిగా మార్చిన చిత్రం ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.పిక్చర్స్ పతాకంపై నిర్మించి శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత వడివేలు నటించిన ఏ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆయన కూడా ఆ తరువాత మళ్లీ హాస్య పాత్రలు పోషించడానికి సుముఖం వ్యక్తం చేయలేదు. తాజాగా విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తి సండై చిత్రంలో హాస్యభూమికను పోషించడానికి అంగీకరించారు. కాగా తనను హీరోగా చేసిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని తాజా సమాచారం. దీనికీ శింబుదేవన్ దర్శకత్వం వహించనున్నారు. సీక్వెల్ చిత్రం అయినా ఈ దర్శకుడిని ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆ తరువాత శింబుదేవన్ చేసిన ఇరుంబు కోట్లై మోరట్టు సింగం,విజయ్ హీరోగా ఇటీవల చేసిన పులి చిత్రం నిరాశపరిచాయి. ఈ చిత్రాన్ని చాలా కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న దర్శకుడు శంకర్ ఎస్.పిక్చర్స్ సంస్థ ప్రస్తుతం రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఫిలింస్‌తో కలిసి భారీ ఎత్తున్న నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం ఇటీవల స్పష్టం చేశారు. అయితే 2.ఓ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత వడివేలు పులికేసి సీక్వెల్ చిత్రం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రాజకీయాల్లోకి వస్తా
తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు కథానాయకుడు అవతారమెత్తిన సీనియర్ హాస్యనటుడు వడివేలు. ఇంతకుముందు అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రచారం చేసి తన సినీ కెరీర్లో చిక్కులను ఎదుర్కొన్న వడివేలు కొంత గ్యాప్ తరువాత తెనాలిరామన్ అనే చారిత్రక కథా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పలు విమర్శలు మధ్య విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. కాగా తాజాగా ఎలి అనే చిత్రంలో నటిస్తున్నారు. తెనాలిరామన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు యువరాజునే ఈ చిత్రానికి దర్శకుడు. నటి సదా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని జి.సతీష్‌కుమార్, ఎస్.అరమనాథ్ నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వడివేలు మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిట్టేస్తున్నారన్నారు. వరుసగా చిత్రాలు చేయడం లేదన్నదే వారి కోపానికి కారణం అన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక చిత్రం చేసేస్తే బాగుండదన్నారు. అలా కొంచెం గ్యాప్ తీసుకుని ఈ ఎలి చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. హీరోయిన్గా సదా నటిస్తున్న ఆమెతో డ్యూయెట్లు పాడలేదన్నారు. అయితే ఆమె ఒక సైడ్ లవ్ చేస్తూ ఊహల్లో తేలుతూ తనతో ఒక హిందీ పాటలో నటించేస్తారని చెప్పారు. చిత్రంలో తాను ఎలి (ఎలుక) ప్రతీప్ రావత్ పూణై (పిల్లి)గా నటిస్తున్నట్లు తెలిపారు. ఎలుక ఏమేమి చేస్తుందో తానీ చిత్రంలో అవన్నీ చేస్తానని చెప్పారు. ఇది పిరియాడ్ చిత్రం కాకున్నా 1960 నుంచి 70 వరకు జరిగే కథా చిత్రం అన్నారు. ఇప్పుడు పులి, సింహం పేర్లతో చిత్రాలు చేస్తున్నామని అయితే వాటిని తన చిత్రం పోటీ కాదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఏమైనా జరగవచ్చు నని తాను రాజకీయాల్లో కొచ్చే అవకాశం లేకపోలేదని వడివేలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలి చిత్ర యాప్‌ను ఆవిష్కరించారు.