కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్‌..? | Keerthy Suresh in Movie with Comedian Vadivelu As Heroine | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్‌..?

Published Tue, Sep 21 2021 10:27 AM | Last Updated on Tue, Sep 21 2021 10:38 AM

Keerthy Suresh in Movie with Comedian Vadivelu As Heroine - Sakshi

అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్‌ వడివేలు సరసన ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’ అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌.

సురాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘నాయ్‌’ అంటే కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టైటిల్‌ పెట్టారట. శేఖర్‌ పాత్రను వడివేలు చేయనుండగా ఆయన సరసన కీర్తి నటించనున్నారని భోగట్టా. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్ర ఉందనీ, ఆ పాత్రనే కీర్తీ సురేష్‌ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. మరి.. వడివేలుకి జోడీగా కీర్తి కనిపిస్తారా? లేక కథకి కీలకంగా నిలిచే పాత్రలో కనబడతారా? అసలు ఈ సినిమాకి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement