ఆయన ఓ లెజెండ్! | Vishal Kathi Sandai Audio Released | Sakshi
Sakshi News home page

ఆయన ఓ లెజెండ్!

Published Sun, Nov 6 2016 2:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఆయన ఓ లెజెండ్!

ఆయన ఓ లెజెండ్!

హాస్య నటుడు వడివేలును లెజెండ్‌గా నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆయన నటించకుంటే కత్తిసండై చిత్రం ఉండేది కాదని కూడా అన్నారు. విశాల్ నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనకు జంటగా తమన్నా నటించిన ఈ చిత్రంలో చాలా విరామం తరువాత నటుడు వడివేలు హస్యపాత్రలో నటించారు. మరో హాస్య నటుడు సూరి, జగపతిబాబు, అరుణ్ ఆరోరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మియించిన ఎస్.నందగోపాల్ తన మెడ్రాస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.
 
  హిఫ్ హాఫ్ తమిళా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు, ప్రచార చిత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు. వడివేలు మాట్లాడుతూ తనని అందరూ చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటిస్తున్నారని అంటున్నారని, నిజం చెప్పాలంటే తనకు గ్యాప్ లేదు, తనకెవరూ ఆఫ్ పెట్టలేరని, తానేప్పూడూ టాపేనని అన్నారు. మంచి కథల కోసమే ఎదురు చూశానని, అలాంటి సమయంలో దర్శకుడు సురాజ్ చెప్పిన కత్తిసండై చిత్ర కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించానని తెలిపారు.
 
  తేని నడిగర్‌సంఘాన్ని మళ్లీ తీసుకొచ్చి దాన్ని వృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న విశాల్ ఈ చిత్రం మరో విజయాన్ని అందిస్తుందని అన్నారు. తరువాత చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ దర్శకుడు సురాజ్ తనకు కథ చెప్పగానే ఇందులో నటించడానికి నటుడు వడివేలు కాల్‌షీట్స్ తీసుకోండని చెప్పానన్నారు. కథ వినగానే ఇందులో ఆయన నటిస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. వడివేలు ఈ చిత్రంలో నటించడం సంతోషం అన్నారు.
 
  తమ కాంబినేషన్‌లో ఇది మూడో విజయం అవుతుందని అన్నారు. నిజం చెప్పాలంటే వడివేలు నటించకుంటే కత్లిసండై చిత్రం ఉండేది కాదనీ, అలాంటి లెజెండ్‌తో మళ్లీ కలిసి నటించడం సంతోషంగా ఉందని విశాల్ పేర్కొన్నారు.కత్తిసండై వినోదభరిత అంశాలతో కూడిన పూర్తి కమర్శియల్ ఎంటర్‌టెరుునర్ కథా చిత్రం అని దర్శకుడు సురాజ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement