బాపుగారి బొమ్మ కొత్త అవతారం ! | Heroine Pranitha Present acting in Tamil Movies | Sakshi
Sakshi News home page

బాపుగారి బొమ్మ కొత్త అవతారం !

Published Tue, May 16 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

బాపుగారి బొమ్మ కొత్త అవతారం !

బాపుగారి బొమ్మ కొత్త అవతారం !

నటి ప్రణీతను బహుభాషా నటి అనే అనాలి. మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌ అనిపించుకున్నా, అంతగా మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. చక్కని శరీరాకృతి, ఆకర్షణీమైన అందం వంటి ప్లస్‌ పాయింట్స్‌ ఉన్నా పాపం ఎందుకో రెండో హీరోయిన్‌ పాత్రలకే పరిమితం అవుతోంది ప్రణీత. తమిళంలో కార్తీ వంటి స్టార్‌ హీరోతో శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత కూడా కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.

దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగిడినా అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో సెకెండ్‌ హీరోయిన్‌ పాత్రతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నటిగా అవకాశాలను నమ్ముకుంటే లాభం లేదనుకుందో ఏమో ఇటీవల బెంగుళూర్‌లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ప్రణీతకు నిర్మాతగా మారాలనే కోరిక పుట్టిందట. త్వరలోనే చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

దీని గురించి ప్రణీత తెలుపుతూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనంది. ఇతర కథానాయికల కంటే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ భామ ఏ భాషలో చిత్రాన్ని నిర్మించేది క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో అధర్వతో నటించిన జెమినీగణేశనుం సురుళీరాజావుం చిత్రం త్వరలో తెరపైకి రానుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement