heroine Pranitha
-
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు..
తాళ్లగడ్డ (సూర్యాపేట) : సరిగ్గా తొమ్మిది సంవత్సరాల ఐదునెలల క్రితం ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26వ తేదీ అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. వీరికి సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా అతివేగం, అజా గ్రత్తగా వాహనం నడిపి పలువురికి గాయాలు కావడానికి కారణమయ్యారని మోతె పోలీసులు నిర్ధారించారు. వాహనంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రమౌళి ప్రసాద్, బాబావలి, రాజీవ్‌కనకాల ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రికి సుమారు ఆరు వాహనాల్లో 15మంది వరకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఆ మూలమలుపు వద్ద పెద్ద బావి ఉంది. కానీ కొద్దితేడాతో కారు ఆగిపోవడంతో ప్రాణనష్టం నుంచి తప్పినట్లయింది. నాడు జూనియర్ ఎన్టీఆర్ సొంత డ్రైవింగ్.. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని అర్ధరాత్రి బయలుదేరారు. తన స్నేహితులతో కలిసి సఫారీ కారును సొంతంగా జూనియర్ ఎన్టీఆరే డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. మోతె సమీపంలోకి రాగానే.. అతివేగంగా నడుపుతున్న కారుఅదుపు చేయలేకపోవడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాదకర మలుపు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుబోల్తా పడిన స్థలం వద్ద ఇప్పటికీ ఎన్నోమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకసారి బస్సుబోల్తా కొట్టింది. కాకినాడ మున్సిపల్ కమిషనర్ వాహనం కూడా ఇదే మలుపు వద్ద బోల్తా పడింది. 2008లో బస్సును ఆటో ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి నెల రోజుల క్రితం లారీ బావిలోపడి ఇద్దరు మృతిచెందారు. నటి ప్రణీతకు తప్పిన ముప్పు.. మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదానికి కూతవేటు దూరంలోని మూ లమలుపు వద్దనే నటి ప్రణీత ప్రయాణిస్తున్న కారు 2016 ఫిబ్రవరి 14 పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ వెంకటేశ్వరరావు, మేకప్ అసిస్టెంట్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ నటి ప్రణీతకు మాత్రం ఎలాంటి గాయం కూడా కాకుండా బయటపడింది. -
కలలో కూడా అలాంటి ఆశ లేదు: నటి
పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు అంటోంది హీరోయిన్ ప్రణీత. ఈ బెంగళూరు బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం నాలుగు భాషల్లోనూ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషల్లోనూ ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకోలేదు. కోలీవుడ్‌లో ఉదయన్ చిత్రంతో నటిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కార్తీకి జంటగా శకుని, సూర్యతో మాస్, జై సరసన ఎనకు వాయ్‌ంద అడిమైగళ్ వంటి చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ప్రణీత మార్కెట్ వేడెక్కలేదు. అయినా ఏం పర్వాలేదు. నటన అన్నది నా ఫ్యాషన్ మాత్రమే అంటున్న ప్రణీతతో చిన్న చిట్‌ఛాట్ కోలీవుడ్‌లో ఎక్కువగా నటించడం లేదే ? అందుకు నా పాలసీ కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువ చిత్రాలు చేయాలన్న ఆసక్తి, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవాలన్న ఆశ నాకు లేవు. మా అమ్మానాన్న ఇద్దరు డాక్టర్లు. వారి కలలు, అక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. మరో విషయం ఏమిటంటే అన్ని భాషల్లోనూ ఒకేసారి నటించడం సాధ్యంకాదు. తెలుగు, కన్నడం, భాషల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ భాషల్లో నటించడానికి సమయం సరిపోతోంది. అయితే తమిళంలో నటించాలన్న ఆసక్తి ఉంది. మంచి అవకాశం అనిపిస్తే అంగీకరిస్తున్నాను. ఇటీవల అధర్వతో నటించిన ‘జెమినీగణేశనుమ్ సురళీరాజనుమ్’ చిత్రంలో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నంట్లుందే? పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. సినిమారంగంలో కొత్త హీరోయిన్లు చాలామందే వస్తున్నారు. అయితే ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుంది. ప్రతిభను బట్టే అవకాశాలు వస్తుంటాయి. అందుకని నేనెవరినీ పోటీగా భావించను. ఎవరు బాగా నటించినా భుజం తట్టి అభినందిస్తానని తెలిపింది. మీరు గ్లామర్‌కు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే వారికి మీరిచ్చే సమాధానం ? అని మీరంటున్నారు. ప్రేక్షకులెవరూ నా గ్లామర్ గురించి కామెంట్ చేయడం లేదు. తెలుగు చిత్రాల్లో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటున్న విషయం గురించి నేను విన్నాను. అయితే నేను నటించినా చిత్రాలు చూస్తే అలాంటి కామెంట్లకు అవకాశం ఉండదు. నన్నెవరూ గ్లామర్‌గా నటించమని ఒత్తిడి చేయలేదు కూడా. కథ, పాత్రలకు తగ్గట్టుగానే నా నటన ఉంటుంది. బాలీవుడ్ ఆశ లేదా? కలలో కూడా అలాంటి ఆశ లేదు. అసలు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. జీవితంలో ఎక్కువగా ఆశించకూడదు. ఒకవేళ ఆశపడింది జరగకపోతే చాలా నిరాశ పడాల్సి వస్తుంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన, నాకు నప్పే పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. నేను ఎన్నేళ్లు నటిస్తానో తెలియదు. అది నా చేతుల్లో లేదు. నటన నాకు ఫ్యాషన్. అందుకే నటిస్తున్నాను. పబ్‌లకు, పార్టీలకు వెళ్లే అలవాటు ఉందా? అసలు లేదు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమారంగంలో స్నేహితులంటూ ఎవరూ లేరు. కాలేజీ స్నేహితులతో కాళీ సమయాల్లో గడుపుతాను. ప్రేమ, పెళ్లి ? నేనెవరిని ప్రేమించలేదు. పెళ్లి కూడా అమ్మానాన్నలు కుదిర్చిన అబ్బాయినే చేసుకుంటాను. వ్యాపారరంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారట ? హోటల్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అమ్మానాన్నకు సొంతంగా బెంగళూరులో ఆస్పత్రి ఉంది. నటన చాలు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను చూసుకో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ! -
బాపుగారి బొమ్మ కొత్త అవతారం !
నటి ప్రణీతను బహుభాషా నటి అనే అనాలి. మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్ అనిపించుకున్నా, అంతగా మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. చక్కని శరీరాకృతి, ఆకర్షణీమైన అందం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నా పాపం ఎందుకో రెండో హీరోయిన్ పాత్రలకే పరిమితం అవుతోంది ప్రణీత. తమిళంలో కార్తీ వంటి స్టార్ హీరోతో శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత కూడా కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగిడినా అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్రతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నటిగా అవకాశాలను నమ్ముకుంటే లాభం లేదనుకుందో ఏమో ఇటీవల బెంగుళూర్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ప్రణీతకు నిర్మాతగా మారాలనే కోరిక పుట్టిందట. త్వరలోనే చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి ప్రణీత తెలుపుతూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనంది. ఇతర కథానాయికల కంటే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ భామ ఏ భాషలో చిత్రాన్ని నిర్మించేది క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో అధర్వతో నటించిన జెమినీగణేశనుం సురుళీరాజావుం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
అమ్మో.. బాపుగారి బొమ్మో..
తాజ్‌కృష్ణాలో మంగళవారం ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీతారలు, మోడల్స్ హంసనడకలతో ర్యాంప్ మురిసింది. ప్రముఖ వస్త్ర షోరూం ‘త్రిష’ ఆధ్వర్యంలో ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో మంగళవారం తాజ్‌కృష్ణాలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. తారలు ప్రణీత, షామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించామని డిజైనర్ అమృతా మిశ్రా చెప్పారు. – జూబ్లీహిల్స్