Actress Priya Bhavani Shankar Started New Restaurant, Video Viral - Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar:రెస్టారెంట్‌కు ఓనర్‌ కాబోతున్న హీరోయిన్‌

Published Tue, Jan 24 2023 8:35 AM | Last Updated on Tue, Jan 24 2023 10:02 AM

Priya Bhavani Shankar Started New Restaurant - Sakshi

బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన నటి ప్రియా భవాని శంకర్‌. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. పాత్ర చిన్నదో పెద్దదో స్టార్‌ హీరోల చిత్రాలు కనిపిస్తోంది.. మరోపక్క కథానాయకిగానూ చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా వచ్చిన కడైకుట్టి సింగం చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇటీవల ధనుష్‌ చిత్రం తిరుచిట్ట్రంఫలం చిత్రంలోనూ కనిపించింది.

ఇకపోతే తాను డబ్బు వస్తుందనే నటించడానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. తాజాగా తాను అలా అనలేదంటూ ప్లేట్‌ పిరాయించింది. వచ్చిన అవకాశాలన్నీ  సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కురబెట్టింది. ఇందుకు ఉదాహరణ గత డిసెంబర్‌ నెలలో చెన్నై సముద్ర తీరంలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నట్లు తనే స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీని అమలు చేస్తూ తాజాగా వ్యాపారంగంలోకి అడుగుపెడుతోంది. ఈ అమ్మడు ఇప్పుడు ఒక రెస్టారెంట్‌కు ఓనర్‌ కాబోతోంది. ఇందు కోసం స్థలాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్‌ను కట్టిస్తోంది. త్వరలో దీన్ని ప్రారంభించనునట్లు నటి ప్రియా భవాని శంకర్‌ ఒక వీడియోను విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement