
డిజిటల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేపడుతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది.
సాక్షి, చెన్నై: డిజిటల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేపడుతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లు, సినిమాల విడుదలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం మండలి సభ్యులు ప్రటించారు.
కాగా, డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు మండిపడ్డారు. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చారు.