
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల సంఘం, థియేటర్ సంఘం నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్ సంఘం సభ్యులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం తమిళ చలన చిత్ర యాక్టివ్ నిర్మాతల మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గం స్టాలిన్‌ను ఆయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.