Hero Surya And His Wife Jyothika Gave Rs 1 Crore Check To CM MK Stalin: తమిళ స్టార్ హీరో సూర్య-జ్యోతిక దంపతులు మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను సూర్య దంపతులు కలిసి ఈ చెక్కను అందజేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రూ, పాజ్హన్కుడి ఇరులర్ ట్రస్ట్ సభ్యులు అ విరాళాన్ని అందుకున్నారు. కాగా సూర్య సేవ కార్యక్రమాల్లో ముందుంటారని తెలిసిన సంగతే. కరోనా సమయంలో తన తండ్రి, సోదరుడు కార్తీలు సీఎం రిలీప్ ఫండ్‌కు విరాళం ఇచ్చారు.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం
కాగా సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఆయన స్వీయ నిర్మాణం 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో నిర్మించిన ఈ చిత్రం రేపు(నవంబర్ 2)న విడుదల కానుంది. తమిళనాడులో 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గిరిజన తెగకు చెందిన సెంగ్గెని, రాజా కను అనే దంపతుల కథతో తెరకెక్కింది. అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ఈ కథ. న్యాయం చేసే న్యాయవాది పాత్రలో హీరో సూర్య నటించగా.. తనకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా రావు రమేష్ నటించారు.
చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
Rs. 1Cr was donated towards the welfare of the Irula Tribe, by @Suriya_offl Sir & #Jyotika Ma’am on behalf of 2D in the presence of our Hon'ble Chief Minister of TN @mkstalin the cheque was handed over to Justice K. Chandru (Retd) & members of Pazhangudi Irula Trust.#JaiBhim pic.twitter.com/uvYdGUbo9U
— 2D Entertainment (@2D_ENTPVTLTD) November 1, 2021
Comments
Please login to add a commentAdd a comment