
High Court Fined Tamil Film Producers Council: నటుడు శింబు కేసులో తమిళ సినీ నిర్మాతల సంఘానికి చెన్నై హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైఖేల్ రాయప్పన్ నటుడు శింబు కథానాయకుడిగా నిర్మించిన అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రం 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నటించడానికి తనకు రూ.8 కోట్లు పారితోకం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.కోటి 51 లక్షలు ఇచ్చిన నిర్మాత మిగిలిన రూ.6 కోట్ల 48 లక్షలు చెల్లించలేదని ఆ మొత్తాన్ని ఇప్పించవలసిందిగా శింబు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు.
చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి?
అదే సమయంలో నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబుతో నిర్మించిన చిత్రంతో తాను తీవ్రంగా నష్టపోయానని, కాబట్టి శింబు నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై శింబు చెన్నై హైకోర్టులో రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్‌లో నిర్మాతల సంఘాన్ని, నడిగర్ సంఘాన్ని, అప్పటి ఈ సంఘం కార్యదర్శి విశాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
చదవండి: బిగ్‌బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
చాలాకాలంగా విచార ణలో ఉన్న ఈ కేసును బుధవారం న్యాయమూర్తి నీ.వేల్ మురుగన్ సమక్షంలో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో 1080 రోజులు అయినా నిర్మా త సంఘం లిఖిత పూర్వకంగా వాదనలను కోర్టులో దాఖలు చేయని కారణంగా ఆ సంఘానికి రూ.లక్ష అపరాధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొ త్తాన్ని ఈ నెల 31వ తేదీలోగా కోర్టు రిజిస్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ ఒకటవ తేదీకి వాయిదా వేశారు.