పెళ్లి కోసం మండపాన్ని బుక్‌ చేసిన విశాల్‌ | Hero Vishal confirmation about his marriage | Sakshi
Sakshi News home page

జనవరిలో హీరో విశాల్‌ వివాహం

Published Sat, Feb 10 2018 10:31 AM | Last Updated on Sat, Feb 10 2018 2:40 PM

Hero Vishal confirmation about his marriage  - Sakshi

హీరో విశాల్‌

సాక్షి, చెన్నై : హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్‌ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నట్లు విశాల్‌ పేర్కొన్నాడు.

సినిమాల్లోనే అనుకున్నా..
ఇక చెన్నైలో రౌడీముఠా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విశాల్‌ స్పందిస్తూ...‘రౌడీ ముఠా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం, అందులో ఆటా, పాటా లాంటివి సినిమాల్లోనే చూపిస్తారనుకుంటామని, నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, వారిని చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన పోలీసులను అభినందించాడు.

మార్చి నుంచి సమ్మె
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ లాంటి సమస్యలపై పోరాడే విధంగా దక్షిణ భారత సినీనటుల సంఘం మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి చిత్రాల విడుదల ఉండదని వెల్లడించారు. ఈ విషయమై స్పందించిన విశాల్‌ మార్చి 1 నుంచి సమ్మె తథ్యం అని స్పష్టం చేశాడు. అయితే క్యూబ్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో తమిళభాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులను అందించే విషయమై నటీనటుల సంఘం సమాలోచనలు చేస్తోందని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement