‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్‌తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.
దీనిపై విశాల్ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.
కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్. – సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment