విజయ్‌ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్‌ ఎమోషనల్‌ | Vishal Comments At Mark Antony Movie Success Meet, Talks About Vijay Antony Daughter - Sakshi
Sakshi News home page

Actor Vishal On Meera Death: మార్క్‌ ఆంటోని సక్సెస్‌.. 11 ఏళ్ల పోరాటం తర్వాత విశాల్‌కు సక్సెస్‌

Published Sat, Sep 23 2023 9:37 AM | Last Updated on Sat, Sep 23 2023 12:07 PM

Vishal Comments on Mark Antony Movie Success Meet - Sakshi

ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్‌ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు.

హీరో విశాల్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని. సునీల్‌, నటి రీతూవర్మ, అభినయకింగ్స్‌లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌కుమార్‌ నిర్మించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించిన మార్క్‌ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్‌ మీట్‌లో విశాల్‌ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్‌కుమార్‌ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్‌ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు.

ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌, నటుడు సునీల్‌ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్‌ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్‌ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్‌ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్‌ పేర్కొన్నారు. విజయ్‌ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్‌ తన కాలేజ్‌మేట్‌ అని పేర్కొన్న విశాల్‌.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్‌ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement