హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటొని. ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో విశాల్, సూర్య.. ఇద్దరూ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఆదివారం(సెప్టెంబర్ 10) జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విశాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
నీ వల్లే నాకీ పరిస్థితి అంటూ..
అధిక్ రవిచంద్రన్.. దాదాపు తొమ్మిదేళ్ల కిందట ఓ స్టోరీ చెప్పాడు. ఓ నిర్మాత దగ్గరికెళ్తే ఇదసలు స్క్రిప్టేనా? అన్నాడు. అలా 40 మంది నిర్మాతలు బయటకు గెంటేశారు. బాధతో మరో కథ రాసుకున్నాడు. త్రిష ఇల్లనా నయనతార అనే సినిమా తీశాడు. అది బ్లాక్‌బస్టర్ హిట్. తర్వాత చేసిన ఓ సినిమా డిజాస్టర్ అయింది. ఒకరోజు నాకు ఫోన్ చేసి.. అన్నయ్య, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. అందులో నీ పేరు రాసి చచ్చిపోతాను అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే నేను మళ్లీ ఫోన్ చేసి నా పేరెందుకు రాస్తా అంటున్నావురా? అని అడిగాను. నువ్వు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాను, లేదంటే నేను ఇంకోలా ఉండేవాడిని అన్నాడు.
ఏడేళ్లు వెయిట్ చేయించా
అలా కాదురా, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఛాన్స్ వస్తుంది. తప్పకుండా కలిసి చేద్దాం అని చెప్పాను. ఏడేళ్లుగా వెయిట్ చేశాడు. ఇంతకాలానికి కలిసి మార్క్ ఆంటోని చేశాం. అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేస్తున్నాను అని చెప్పగానే చాలామంది నిర్మాతలు ఈ డైరెక్టర్‌తో ఎందుకు సర్? ఆయన సినిమాలు సరిగా ఆడలేదు, హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో వెళ్లవచ్చు కదా అని సూచించారు. నేను అతడి సినిమా ఎందుకు చేశాననేది సెప్టెంబర్ 15న మీ అందరికీ తెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు విశాల్.
చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్ హీరో
Comments
Please login to add a commentAdd a comment