Mark Antony Movie
-
మరోసారి సీబీఐ ఆఫీసుకు వెళ్లిన హీరో విశాల్
విశాల్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోని చిత్రం గత అక్టోబర్‌లో విడుదలై అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో మార్క్ ఆంటోని సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ముంబైలోని సెన్సార్ బోర్డు అధికారులను సంప్రదించింది.కానీ మార్క్ ఆంటోని సినిమాను హిందీలో విడుదల చేసేందుకు సెన్సార్ సర్టిఫికెట్ రావడం అంత ఈజీ కాదని హీరో విశాల్ అన్నారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు లంచం అడిగేలా ముంబై సెన్సార్ బోర్డ్ అధికారులు మెర్లిన్ మేనకా అనే బ్రోకర్ ద్వారా మార్క్ ఆంటోని చిత్ర బృందాన్ని సంప్రదించారు. దీన్ని అస్సలు ఊహించని చిత్ర నిర్మాతలు.. తదనంతరం, విశాల్ మేనేజర్ హరికృష్ణన్ బ్రోకర్ మెర్లిన్ మేనకాతో మాట్లాడి లంచం ఇచ్చాడు. ఆపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌పై విశాల్ చేసిన ఆరోపణలతో సీబీఎఫ్సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ఇలా తెలిపాడు. 'మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించిన ఈ కేసు పూర్తిగా కొత్త అనుభవాన్ని ఇచ్చింది. విచారణలో భాగంగా అక్కడి అధికారులు వ్యవహరించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు విచారణ కోసం వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది.' అని విశాల్ పేపర్కొన్నాడు. నటుడు విశాల్, అతని మేనేజర్ హరికృష్ణలను ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రెండోసారి పిలిపించిన అధికారులు వారికి ఎంత మొత్తంలో లంచంగా చెల్లించారనే దానిపై విచారణ చేపట్టారు. గత సారి సీబీఐ అధికారులు విశాల్ మేనేజర్ హరికృష్ణను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. Just finished my visit to CBI office in Mumbai for an enquiry regarding the CBFC case. Was a complete new experience and am glad the way the enquiry is being conducted. Took some inputs too about how a CBI office would look like. Lol. Never ever thought in my life I will be going… — Vishal (@VishalKOfficial) November 28, 2023 -
ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!
సౌత్ ఇండియాలో ప్రముఖ నటుడిగా ప్రభు కొనసాగుతున్నారు. హీరోగా మొదలైన ఆయన కెరియర్ ప్రస్తుతం తండ్రి పాత్రలలో పలు చిత్రాల్లో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు. ప్రభుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్రమ్ అనే కుమారుడితో పాటు ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన 'ఇరుకప్పపుట్టు' అనే చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్నేహితుడిలా ఐశ్వర్యకు పరిచయం అయ్యాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. వారి స్నేహం కాస్త ప్రేమగా మారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో తన బంధువైన కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఐశ్వర్య తన భర్త కునాల్‌తో కలిసి అమెరికాలో స్థిరపడింది. భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో తన సోదరుడి చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో స్నేహం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ నటించిన 'త్రిష ఇల్లనా నయనతార' సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అక్కడ క్రేజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన `మార్క్ ఆంటోని` సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో విశాల్, ఎస్.జె.సూర్య నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 63వ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవలే అధిక్ రవిచంద్రన్, ప్రభు కూతురు ఐశ్వర్యల నిశ్చితార్థం జరిగిందని, డిసెంబర్ 15న పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే ప్రభు తరఫు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా అంటున్నారు. -
రూ.100 కోట్ల సినిమా.. డైరెక్టర్‌కి గిఫ్ట్‌గా కాస్ట్లీ కారు
సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఎంత ఆనందపడతారో.. ఆ మూవీ తీసిన నిర్మాత అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే కోట్లు పెడతాడు కదా! అలా లాభాలు వచ్చిన ఆనందంలో చిత్రబృందానికి కళ్లు చెదిరే బహుమతులు ఇస్తుంటారు. మొన్నీమధ్య 'జైలర్' నిర్మాత కార్ల దగ్గర నుంచి గోల్డ్ కాయిన్స్ వరకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు మరో నిర్మాత.. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకున్నాడు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అప్పుడెప్పుడో 'పందెం కోడి' లాంటి సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మన దగ్గర హిట్ కొట్టలేకపోయాడు. చాలా ఏళ్ల తర్వాత 'మార్క్ ఆంటోని'గా వచ్చిన విశాల్.. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 'మార్క్ ఆంటోని'లో విశాల్ కంటే ఎస్జే సూర్య నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ తెలుగులో డీసెంట్ టాక్ అందుకుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్‌ని నిర్మాత వినోద్ సర్ప్రైజ్ చేశాడు. దాదాపు రూ.90 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Blockbuster #MarkAntony Prod Vinod gifted a BMW Car to Dir Adhik Ravichandran 👏 pic.twitter.com/KNirFQjFD4 — Christopher Kanagaraj (@Chrissuccess) October 30, 2023 -
మార్క్ ఆంటోనీ తర్వాత క్రేజీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన విశాల్
మార్క్ ఆంటోనీ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టిన విశాల్.. తాజాగా కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇంతకుముందు విశాల్ కథానాయకుడిగా భరణి, పూజ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్ దర్శకుడు హరి ఇప్పుడు మూడోసారి డైరెక్ట్ చేస్తున్నారు. ఇది విశాల్ నటిస్తున్న 34వ చిత్రం. ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటిస్తుండగా దర్శకుడు సముద్రఖని, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీన్ని జి స్టూడియోస్ సౌత్ సంస్థతో కలిసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన స్టోన్ పెంచి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూత్తుకుడి జిల్లా విళాత్తికుళం పరిసర ప్రాంతాల్లో చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు హరి చిత్రీకరిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రను పోషిస్తున్ననట్లు నటుడు విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో ఆగిపోయిన డిటెక్టెవ్- 2 చిత్రాన్ని దర్శకుడిగా విశాల్‌నే హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా విశాల్, హరి కాంబోలో రూపొందుతున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు హరి అంటేనే మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్. మరి ఈయన విశాల్‌తో తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో చూడాలి. -
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతున్న సూపర్ హిట్ తెలుగు సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కథానాయకుడిగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మార్క్ ఆంటోని'. సెప్టెంబర్ 15న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. హీరో విశాల్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్జే సూర్య జీవించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్) అక్టోబరు 13వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. ' నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి' అని విశాల్ తెలిపాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పరపెక్ట్గా సెట్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఆదివారం చూసి ఎంజాయ్ చేయండి. Happy to see #MarkAntony killing it in Ott platform too. Trending no 1 in Amazon Prime. Enjoy the unlimited entertainment, especially my favourite Silk Smitha scene in your own homes now. God Bless pic.twitter.com/RXTCaQJNQY — Vishal (@VishalKOfficial) October 14, 2023 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రేక్షకులు చూపు ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వీకెండ్లో అంటే గురువారం, శుక్రవారం దాదాపు 29 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు మాత్రం స్పెషల్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో 29 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానం సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం అనే వెబ్ సిరీస్.. తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 13) జీ5 ప్రేమ విమానం - తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్ మార్క్ ఆంటోని - తెలుగు డబ్బింగ్ మూవీ ఇన్ మై మదర్స్ స్కిన్ - తగలాగ్ మూవీ ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ - ఇటాలియన్ సిరీస్ ద బరియల్ - ఇంగ్లీష్ సినిమా హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) హాట్ స్టార్ గూస్బంప్స్ - ఇంగ్లీష్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ దిల్లీ - హిందీ సిరీస్ మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఇజగ్బాన్ - యోరుబా సినిమా కాసర్ గోల్డ్ - మలయాళ మూవీ ద కాన్ఫరెన్స్ - స్వీడిష్ చిత్రం క్యాంప్ కరేజ్ - ఉక్రేనియన్ సినిమా (అక్టోబరు 15) క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ - హిందీ సిరీస్ (అక్టోబరు 15) గుడ్‌నైట్ వరల్డ్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మట్టికథ - తెలుగు సినిమా మిస్టేక్ - తెలుగు సినిమా సోనీ లివ్ సంతిత్ క్రాంతి సీజన్ 2 - మరాఠీ సిరీస్ ఫాంటమ్ - కొరియన్ సినిమా బుక్ మై షో టాక్ టూ మీ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబరు 15) ద క్వీన్ మేరీ -ఇంగ్లీష్ చిత్రం (అక్టోబరు 15) ద ఈక్వలైజర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే పాస్ట్ లైవ్స్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా మురాఖ్ ద ఇడియట్ - హిందీ షార్ట్ ఫిల్మ్ రింగ్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15) ద లాస్ట్ ఎన్వలప్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఈ-విన్ మిస్టర్ నాగభూషణం - తెలుగు సిరీస్ (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే
ఓటీటీల వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు మన ముందుకొచ్చేస్తున్నాయి. అలానే ఈ మధ్య రిలీజైన ఈ మూవీ.. తెలుగు యావరేజ్ అనిపించుకున్నప్పటికీ తమిళంలో మాత్రం రూ.100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్నప్పటికీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఏ సినిమా? విశాల్ తెలుగోడే. కానీ తమిళంలో హీరోగా సెటిలైపోయాడు. చాలా ఏళ్ల క్రితమే 'పందెం కోడి' లాంటి మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. అయితే గత కొన్నాళ్లల్లో అన్ని మూస చిత్రాలు చేస్తూ విసిగించాడు. అతడు కాస్త రూట్ మారి చేసిన సినిమా 'మార్క్ ఆంటోని'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తెలుగు ఆడియెన్స్‌కి ఎక్కలేదు గానీ తమిళోళ్లు మాత్రం ఎగబడి మరీ చూశారు. దీంతో రూ.100 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) ఓటీటీలోకి అప్పుడే? సెప్టెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కొన్నిచోట్ల ఇంకా థియేటర్లలో ఉంది. కానీ ఓటీటీ తేదీని ఇప్పుడు ఫిక్స్ చేసేశారు. అక్టోబరు 13 నుంచి అంటే ఈ శుక్రవారమే అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. సో అదన్నమాట విషయం. ఒకవేళ మీరేమైనా మిస్ అయ్యుంటే.. దీనిపై ఓ లుక్కేసేయండి. కథేంటి? సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్ చేసే టెలిఫోన్ కనిపెడతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) చనిపోవడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. తండ్రిలా రౌడీ కాకూడదని మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అలాంటి ఇతడికి టైమ్ ట్రావెల్ చేసి టెలిఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ ద్వారా చనిపోయిన తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. అప్పుడో నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిజం? చివరికేమైంది అనేది 'మార్క్ ఆంటోని' కథ. a laughter fest taking you beyond the dimensions of time! 🕰️#MarkAntonyOnPrime, Oct 13 pic.twitter.com/GmGjSfoku9 — prime video IN (@PrimeVideoIN) October 10, 2023 (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా) -
మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!
అభినయ .. ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది-2, సీతారామం చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజైన విశాల్ మూవీ మార్క్ ఆంటోనీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అభినయ సినిమాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన తండ్రితో కలిసి హాజరైంది. ఆమె తండ్రి అభినయ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభినయకు వినపడదు.. అంతే కాదు మాట్లాడలేదు కూడా.. కేవలం సైగల ద్వారానే తన భావాలను వ్యక్తం చేయగలదు. (ఇది చదవండి: సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అభినయ తండ్రి ఆనంద్ మాట్లాడుతూ.. 'నా కూతురిని మొదట మోడలింగ్ రంగంలో తనను వాళ్ల అమ్మనే చాలా బాగా చూసుకుంది. నేను చాలా కంపెనీల వద్దకు వెళ్తే నాపై కొప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. అతనేమైనా పిచ్చోడా అన్నారు. కానీ నేను దేవుడిపై భారం వేశాను. మాకు గాడ్ ఎవరంటే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. మా అమ్మాయి ఇంత అందంగా పుట్టినా.. దేవుడు ఈ ప్రాబ్లమ్ ఇచ్చాడే అనుకున్నాం. మూడేళ్ల వరకు తాను నడవలేదు. చివరికీ హ్యాండీక్యాప్ అనుకున్నాం. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్న తను అందరితో కలిసిపోతుంది. ' అని అన్నారు. అభినయ మాట్లాడుతూ..'తన తల్లిదండ్రులు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నింటిలోనూ నన్ను నడిపించేది అమ్మ, నాన్నే. నాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. నా కుటుంబ సభ్యుల సహకారం జీవితంలో మరిచిపోలేను. మా నాన్నే నా జీవితం. మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. నాకు, నాన్నకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఎప్పడు ఉంటుంది. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎంతో సరదాగా ఉండేది. అప్పుడప్పుడు నువ్వే నా భర్త అనేదాన్ని. తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా' అని అన్నారు. విశాల్‌తో అభినయ పెళ్లి? ఈ వార్త విని షాకింగ్ గురైనట్లు అభినయ వెల్లడించింది. నేను ఆయనను చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలొచ్చాయి. ఒక ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. ఏదో యూట్యూబ్‌లో చూసి ఆమె అలా మాట్లాడింది. కానీ నాకు ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా తల్లిదండ్రులే నాకు అన్నీ కూడా. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేయాలి. రిలేషన్లో విలువలు ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని అభినయం అంటోంది. (ఇది చదవండి: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు) -
విశాల్ ఆరోపణతో సంచలన నిర్ణయం తీసుకున్న సెన్సార్ బోర్డు
విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని CBFC (Central Board of Film Certification)పై ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన చెప్పారు. ఈ విధంగా ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం అనంతరం సెన్సార్ బోర్డు ఒక కీలక నిర్ణయంతో పాటు విశాల్ ఆరోపణలపై కూడా స్పందించింది. (ఇదీ చదవండి: ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?) విశాల్‌ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని కేంద్ర సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు తీసుకుంది థర్డ్‌పార్టీ వారని వెల్లడించింది. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెన్సార్ బోర్డులో ఇలాంటి పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఇకనుంచి ఆన్లైన్లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సెంట్రల్ సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఈ- సినీప్రమాన్‌లో దర్శక, నిర్మాతలు రిజస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి సంవత్సరం CBFC వద్దకు సుమారు 18వేల చిత్రాలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం వస్తుంటాయని.. అన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది అని గుర్తుచేసింది. కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాకు ముందుగా సెన్సార్ ఇవ్వాలని కోరరాదని తెలిపింది. నిబంధనల ప్రకారమే ఇక నుంచి ఆన్లైన్లో సెన్సార్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
విశాల్ దెబ్బతో అక్కడ మొదలైన ప్రకంపనలు
సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని, త్వరలోనే విచారణ చేపడుతామని ఒక సీనియర్ అధికారిని ముంబైకి కూడా పంపించింది. తర్వాత విశాల్ కూడా ఈ విషయాన్ని అంతటితో ఆపేశాడు. (ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు') ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో కూడా సెన్సార్ బోర్డు అధికారులపై పలు విమర్శలు రావడంతో.. కేంద్ర స్థాయిలో సెన్సార్ బోర్డు మీద వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాల్ ఆరోపణలపై చర్చించారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు సమాచారం. త్వరలో అన్ని రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. విశాల్ చేసిన ఆరోపణలు నేషనల్ మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో దేశం మొత్తం సంచలనంగా మారింది. దీంతో ముంబై సెన్సార్ బోర్డులో కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికి విశాల్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. -
నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్
సౌత్ ఇండియా హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ వారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఇందుకు గాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకోసం ఒక సీనియర్ అధికారిని విచారించమని ముంబైకు కూడా పంపింది. అంతేకాకుండా CBFC వేధింపులకు ఎవరైనా గురై ఉండుంటే తగు సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కేంద్ర సమాచార శాఖ తెలిపింది. (ఇదీ దచవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) ఈ విషయంపై తాజాగా హీరో విశాల్ స్పందించాడు. 'కేంద్ర సమాచార, ప్రసార శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముంబైలో అవినీతి సమస్యకు సంబంధించిన ఈ ముఖ్యమైన విషయంపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాడం చాలా సంతోషం. నా ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగు చర్యలు ప్రారంభించారు. మీకు చాలా ధన్యవాదాలు. లంచం తీసుకున్నవారిపై తప్పక తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.. ఇదీ అవినీతిలో భాగమైన ప్రతి ప్రభుత్వ అధికారికి ఒక ఉదాహరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. దేశంలో అవినీతికి అడుగులు పడకుండా నిజాయితీ గల సేవా మార్గాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా ఫిర్యాదుతో వెంటనే రియాక్ట్ అయ్యేలా చూసిన నా ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్షిండేలకు మరోసారి నా కృతజ్ఞతలు. ఈ కేసు విషయంలో తక్షణమే చొరవను తీసుకురావడం వల్ల నా లాంటి సామాన్యుడికి, ఇతరులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది. జై-హింద్..' అంటూ విశాల్ రియాక్ట్ అయ్యాడు. విశాల్ తనకు జరిగిన అన్యాయాన్ని మొదట X (ట్వటర్)లో తెలుపుతూ నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) I sincerely thank @MIB_India for taking immediate steps on this important matter pertaining to corruption issue in #CBFC Mumbai. Thank you very much for the necessary action taken and definitely hoping for this to be an example for every government official who intends to or is… — Vishal (@VishalKOfficial) September 30, 2023 -
విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్
సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాలని వీడియోలో పేర్కొన్నారు. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని ఇలా పేర్కొంది. (ఇదీ చదవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) 'CBFCలో జరిగిన అవినీతిపై విశాల్ బయటపెట్టిన అంశం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారిని వెంటనే ముంబయికి పంపాం. తప్పు జరిగినట్లు తేలితే శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరూ మంత్రిత్వ శాఖకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. CBFC వేధింపులకు సంబంధించిన ఏదైనా విషయాలను గురించి సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కోరుతున్నాము'. అని సమాచార మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ) అయితే సమాచారా, ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్టుపై పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్పందించాయి. తమకు ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని పేర్కొన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ స్పందిస్తూ.. ‘సీబీఎఫ్సీ, సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ రెండింటితోనూ తమకు మంచి సంబంధాలు ఉన్నాయి. 2001 నుంచి ఎంతో దగ్గరగా చూస్తున్నాం.. సెన్సార్ బోర్డు వారు ఎంతో పారదర్శకతగా పనిచేస్తున్నారు. తమ తొలి చిత్రం దిల్ చహ్తా హై దగ్గర నుంచి ఇటీవల విడుదలైన ఫక్రే 3 సినిమా వరకు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయంపై బాలీవుడ్ దర్శకుడు అశోక్ పండిట్ కూడా స్పందించారు. విశాల్ పేర్కొన్న ఎం రాజన్, జిజా రాందాస్ ఆ ఇద్దరూ CBFC ఉద్యోగులు కారని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా విశాల్ చేస్తున్న ఆరోపణల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. ఈ విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ స్పందనపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. సౌత్ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌పై ఎలాంటి కామెంట్ చేసినా తట్టుకోలేరని పలు కామెంట్లు చేస్తున్నారు. The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate. The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting… — Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023 -
'సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) విశాల్ ట్వీట్లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
రజనీకాంత్, సిల్క్ స్మిత మధ్య జరిగింది ఏంటి.. ఇందులో నిజమెంత?
ఒకప్పుడు వెండితెరను ఏలిన సౌందర్య రాశి సిల్క్ స్మిత.. ఆమె మరణించి ఇప్పటకి సరిగ్గా 27 ఏళ్లు పూర్తి అయ్యాయి. సిల్క్ స్మిత 80వ దశకంలో తన పెద్ద కళ్లతో, మనోహరమైన చిరునవ్వుతో, ఆవేశపూరితమైన అందంతో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచాన్ని తుఫానుగా మార్చేసిందని చెప్పవచ్చు. 80, 90 దశకాల్లో స్మిత పాటలు లేని సినిమాలు చాలా అరుదు. సిల్క్ స్మిత తన 17 ఏళ్ల నట జీవితంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది. సినిమా కథ కంటే ఎక్కువగా స్మిత నిజ జీవితంలో ఎక్కువ కష్టాలు ఉండేవి. నిర్మాతగా మారి సినిమాలు కూడా ఆమె తీశారు. కానీ ఆ రంగంలో పరాజయాలు అందుకోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడం.. ప్రేమ వ్యవహారం దెబ్బతినడంతో తట్టుకోలేకపోయారు. 1996లో (అప్పటికి 35 ఏళ్ల వయసు) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆమె మరణానికి పూర్తి కారణాలు ఇప్పటికీ తెలియవు. గ్లామరస్లో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు సౌత్ ఇండియాలో పాపులారిటీ విషయంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లతో పోటీ పడింది సిల్క్ స్మిత. అప్పట్లో ఈ నటిపై చాలా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నటి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రేమలో ఉందనే వార్త అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. సిల్క్ స్మిత 80వ దశకంలో కమల్‌హాసన్‌తో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రలు చేయడంలో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు. సిల్క్ అనేక బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించింది. సిల్క్ శరీరంపై సిగరెట్ మచ్చలు రజనీకాంత్, సిల్క్ 1983లో జీత్ హమారీ, 1983లో తంగా మగాన్, పాయుమ్ పులిలో కలిసి పనిచేశారు. అదే సమయంలో, ఈ చిత్రాలలో సిల్క్ యొక్క ఆకర్షణీయమైన డ్యాన్స్ అప్పట్లో పలు వివాదాలకు దారితీసింది. రజినీ, సిల్క్ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్‌తో కాల్చాడని కూడా ఆనాడు భారీగానే రూమర్స్ వచ్చాయి. అప్పట్లో వారిద్దరి గురించే ప్రతి సినిమా సెట్లో పలురకాలుగా చర్చించుకునే వారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియరాలేదు. వారిద్దరూ కలిసి పలు రొమాంటిక్ సాంగ్స్‌లలో నటించినందుకే ఈ రూమర్స్ వచ్చాయని మరికొందరు చెప్పుకునేవారు. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న మరణించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత విశాల్ 'మార్క్ ఆంటోని' చిత్రంలో స్మిత మాదిరి తమిళ నటి విష్ణుప్రియా గాంధీ కనిపించింది. మేకప్ సాయంతో ఆమెను అచ్చూ సిల్క్ మాదిరే తెరపై చూపించారు. దీంతో ఆమెకు సంబంధించిన పాత విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
విజయ్ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్ ఎమోషనల్
హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని. సునీల్, నటి రీతూవర్మ, అభినయకింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్‌కుమార్ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నటుడు సునీల్ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్ తన కాలేజ్‌మేట్ అని పేర్కొన్న విశాల్.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య -
Mark Antony: చంద్రబాబు ‘వెన్నుపోటు’పై హీరో విశాల్ సెటైర్లు
గత 30 ఏళ్లుగా ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పటి నుంచి వెన్నుపోటు పదం రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఈ వెన్నుపోటుపై చర్చ జరుగుతూనే ఉంది. స్వయాన ఎన్టీఆర్ గారే ‘ పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు’అని మండిపడ్డాడు. దీంతో వెన్నుపోటు అనగానే తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు టక్కున గుర్తొస్తాడు. తాజాగా ఈ వెన్నుపోటు డైలాగ్‌తో చంద్రబాబుపై సెటైర్లు పేల్చాడు హీరో విశాల్. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘మార్క్ ఆంటోని’ విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. బాబుపై ‘వెన్నుపోటు’ సెటైర్లు ఇది డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కొన్ని సంభాషణలను పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు గురించి హీరో విశాల్ వేసే సెటైరికల్ డైలాగ్ థియేటర్స్‌లో విజిల్స్ వేయించింది. ఈ సినిమా కథ 1975 నేపథ్యంలో సాగుతున్నప్పుడు ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’సినిమా కోసం హీరో తన స్నేహితుడితో కలిసి థియేటర్‌కి వెళ్తాడు. అక్కడ ఒకడు కత్తితో హీరోపై దాడి చేస్తాడు. వెనుకవైపు నుంచి పొడిచేందుకు ప్రయత్నించగా.. హీరో వాడిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో వాడి షర్ట్ చిరిగిపోయి.. గుండెలపై ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది. అంటే వాడు ఎన్టీఆర్ అభిమాని అన్నమాట. అది గమనించిన హీరో.. ‘అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా’అంటాడు. వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తుకు రావడం సహజం. అందుకే విశాల్ ఆ డైలాగ్ చెప్పగానే ‘చంద్రబాబు..చంద్రబాబు’అని ఆడియన్స్ గట్టిగా నవ్వుతున్నారు. -
Mark Antony Movie Review: ‘మార్క్ ఆంటోని’ మూవీ రివ్యూ
టైటిల్: మార్క్ ఆంటోని నటీనటుటు: విశాల్, ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతువర్మ, అభినయ తదితరులు నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ 1975-1995 మధ్య కాలంలో జరుగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెడతాడు. దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి. అయితే అది కనిపెట్టిన కొద్ది రోజులకే అతను చనిపోతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) మరణించడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. మార్క్‌కి తండ్రి ఆంటోనీ అంటే ద్వేషం. తన తల్లిని అతనే చంపాడని భావిస్తాడు. తండ్రిలా తాను రౌడీ కావొద్దని, కత్తులకు, తుపాలకు దూరంగా ఉంటూ మెకానిక్‌గా పని చేసుకుంటాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆంటోనీ ఎలా మరణించాడు? మరణించిన తండ్రిని మార్క్ ఎలా బతికించుకున్నాడు? మార్క్ తల్లిని హత్య చేసిందెవరు? ఈ కథలో ఏకాంబరం(సునీల్) పాత్ర ఏంటి? రమ్య(రీతూ వర్మ)తో మార్క్ ప్రేమాయణం ఎక్కడికి దారి తీసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే మార్క్ ఆంటోనీ. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టైమ్ ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జే సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్‌గా ముందుకు సాగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి 1975లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెట్టే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 1995కి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎస్జే సూర్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ పాత్రలు పండించే కామెడీ, డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. అయితే టైమ్ ట్రావెల్ మిషన్‌తో ప్రతిసారి గతంలోకి వెళ్లడం..మళ్లీ ప్రస్తుత కాలంలోకి రావడం.. కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురవుతారు. ఇంటర్వెల్ వరకు కథ యమ స్పీడ్‌గా ముందుకు వెళ్తుంది. ఇక సెంకడాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది. రిపీట్ సీన్స్ కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. టెలిఫోన్ని ఉపయోగించి చనిపోయిన వారిని బతికించుకోవడం కొంతవరకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆ తరహా సన్నివేశాలే రిపీట్ కావడం ఇబ్బందిగా, గందరగోళంగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే అనకొండ(మిషన్ గన్) ఫైట్ సీన్ అయితే హైలైట్. ఈ సన్నివేశంలో విశాల్ ఎంట్రీ, గెటప్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఎలాంటి లాజిక్కులు వెతక్కుండా వెళ్తే ‘మార్క్ ఆంటోనీ’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడం విశాల్‌కు అలవాటు. మార్క్ ఆంటోనిలో కూడా వైవిధ్యమైన పాత్రనే పోషించాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలకు తనదైన నటనతో న్యాయం చేశాడు. లుక్ పరంగానూ వ్యత్యాసం చూపించాడు. ఇక క్లైమాక్స్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. జాకీ మార్తాండగా, అతని కొడుకు మార్తాండ్‌గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. తెరపై ఆయన పండించిన కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. విశాల్, సూర్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు. ఇక గ్యాంగ్‌స్టర్ ఏకాంబరం పాత్రకు సునీల్ న్యాయం చేశాడు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త చిరంజీవి పాత్రలో సెల్వ రాఘవన్ తన పరిధిమేర చక్కగా నటించాడు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
మార్క్ ఆంటోని ట్విటర్ రివ్యూ.. విశాల్ సినిమాకు హిట్ టాక్!
హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా ఎన్నో అడ్డంకులను దాటి నేడు(సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినయ, రీతూ వర్మ కథానాయికలుగా నటించగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఎస్జే సూర్య, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్. వినోద్ కుమార్ నిర్మించాడు. ఈ మధ్యే జైలర్ సినిమాలో కామెడీ రోల్‌తో మెప్పించిన సునీల్ ఈ చిత్రంలోనూ కీ రోల్లో యాక్ట్ చేశాడు. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షోలు పడటంతో సినీప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ కార్తీ వాయిస్‌తో ఇంట్రడ్యూస్ అయ్యాయట. ఈ చిత్రంలో ఎస్జే సూర్య కామెడీ, యాక్టింగ్ అదిరిపోయిందని టాక్. ఒంటిచేత్తో సినిమాను నడిపించేశాడని ట్విటర్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రారంభంలో, ముగింపులో.. దళపతి విజయ్‌కు, తలా అజిత్‌కు థ్యాంక్స్ కార్డ్ వేశారట.. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అదిరిపోయిందని.. ఈ సినిమాతో విశాల్ సూపర్ హిట్ కొట్టాడని ట్వీట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లబ్ సీక్వెన్స్, సిల్కు సీన్, క్లైమాక్స్‌లో ఫన్.. నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. సునీల్‌కు మరోవైపు కొందరు మాత్రం సినిమా మరీ ఓ రేంజ్లో ఏమీ లేదని ఒకసారి మాత్రం చూడవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సునీల్ ఈ మధ్యే కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మావీరన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. జైలర్‌తో మరోసారి ప్రేక్షకులకు టచ్‌లోకి వచ్చాడు. తమిళ సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చాడో, లేదో అప్పుడే అక్కడి నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సునీల్ చేతిలో ఈగై, బుల్లెట్, జపాన్ సహా పలు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో గుంటూరు కారం, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నాడు. #MarkAntony - Villain for the Win! Some Logic issues aside, gets a good play with time travel concept & fun working with mad performances & ideas! Sumaar 1st half but 2nd makes it up to a good extent... Nadippu Arakkan SJ Surya 💯🔥 Vishal scores well 💥 Loud music DECENT-GOOD https://t.co/OGrZqjGFDN pic.twitter.com/Uagb6JWt8U — Shreyas Srinivasan (@ShreyasS_) September 15, 2023 #MarkAntony World First review First half Good👌Second half Vera level 💥Screenplay🔥Music💥Vishal 💥SJ.Suryah the show stealer💥Mark Antony 🤜🤛 Jackie/Madhan Pandiyan💥Lot of fun theatrical moments😂Sure Shot Blockbuster 🔥Overall worth watch movie My rating 4.3/5⭐ pic.twitter.com/n9XMUceycD— MR.Reviewer (@review0813) September 14, 2023 first half taking slow start and fun ride .. bang with the interval block till now it’s Good . #MarkAntony #MarkAntonyFromSep15 #markantonyreview#markantonyusa@VishalKOfficial @iam_SJSuryah— Thileep Solaiyan (@thileep16) September 15, 2023 #MarkAntony Rating - 3/5 - Fun GuaranteedReview - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun.Many theater moments. Good 1st half and superb… pic.twitter.com/mKQy92m7qs— Cinema Bugz (@news_bugz) September 15, 2023 #MarkAntony Rating - 3/5 - Fun Guaranteed Review - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun. Many theater moments. Good 1st half and superb… pic.twitter.com/mKQy92m7qs — Cinema Bugz (@news_bugz) September 15, 2023 #markantonyreview ⭐️⭐️⭐️⭐️/ 5 wow we all enjoyed the movie thoroughly Have no words to express the gunshot forthcoming block buster victory .Its a great entertainer from 6 to 60 .. Awesome @VishalKOfficial and team . @iam_SJSuryah sir at his best 🎊🎊🎊#MarkAntony #vishal pic.twitter.com/tl3vyfxjgJ — Raja_cinemaholic (@raja_nagamuthu) September 15, 2023 Had a chance to watch #MarkAntony At Kerala , Kochi Savitha 5 Am show Mind blowing film perfect in each aspect @VishalKOfficial na comeback 🔥🔥 what a perfomer you are 🔥🔥. @iam_SJSuryah you nailed the role man 🫡🔥🔥🔥 @Adhikravi comeback 🔥 overall 4.5/5 💥💥💥💥💥💥💥💥 — jd_The master (@iam_groot_22) September 15, 2023 #MarkAntony Rating - 3.5 /5 - Fun Guaranteed Review - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun.#Vishal #sjsurya pic.twitter.com/XwI4O6KsQZ — REVIEW BUZZ (@Kumar02708212) September 15, 2023 #MarkAntony is totally waste of time to watch it in theatres , here is some positive and negative points Positives of this movie 1) Sj Surya acting next level 🔥 2) direction is good 4) comedy excellent Negatives points 1) Vishal acting is totally bad No proper story#Vishal https://t.co/dPxqk9xVE1 — Vikram Rathoreᴶᵃʷᵃⁿ ᴰᵘⁿᵏⁱ (@KingKhanSRK__) September 15, 2023 చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్ బ్యాచ్ అవుట్.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్ -
కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్‌కే 'మార్క్ ఆంటోని'
హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. 'మార్క్ ఆంటోని' విడుదల మీద కొన్నిరోజుల క్రితం మద్రాస్ కోర్టు స్టే విధించింది. కానీ తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయినట్లే. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) ఏంటి గొడవ? గతంలో ఓ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర దాదాపు రూ.20 కోట్ల మేర అప్పు చేశాడు. అది తిరిగి చెల్లించే విషయంలో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్.. విశాల్ తమకు రూ.15 కోట్లు చెల్లించాలని, అప్పటివరకు 'మార్క్ ఆంటోని' రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడది విశాల్‌కి పాజిటివ్‌గా వచ్చింది. 'మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది' అని హీరో విశాల్ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది. 'మార్క్ ఆంటోని'లో ఎస్.జే.సూర్య కీ రోల్ చేశాడు. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, మహేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మార్క్ ఆంటోని'. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళం, తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!) ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమాలో దివంగత నటి సిల్క్ స్మితను చూసి షాక్ తిన్నారు. అయితే ఈ పాత్రను ఏఐ టెక్నాలజీ రూపొందించారని అందరూ భావించారు. అసలు మార్క్ ఆంటోనీ చిత్రంలో నిజంగానే సిల్క్ స్మిత పాత్ర కనిపించనుందా? ఆ ట్రైలర్లో ఉన్న నటి ఎవరు? అదేంటో తెలుసుకుందాం. 'మార్క్ ఆంటోని' ట్రైలర్లో నటి సిల్క్ స్మితను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మొదటగా సిల్క్ స్మితను ఏఐ టెక్నాలజీ సాయంతో రీక్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అచ్చం సిల్క్ స్మితను పోలి ఉండే మరో తమిళ నటి మన ముందుకు రాబోతోంది. ఆమెనే విష్ణుప్రియా గాంధీ. సిల్క్ పాత్రలో విష్ణుప్రియా గాంధీ అచ్చం ఆమె పోలికతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అచ్చం సిల్క్ స్మిత సిస్టర్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) ఈ నేపథ్యంలో దీనిపై మార్క్ ఆంటోని మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి బాబు సైతం సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రకు సిల్క్ స్మితగా విష్ణుప్రియా గాంధీని తీర్చిదిద్దే అవకాశమిచ్చినందుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్‌లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
సూసైడ్ లెటర్లో నా పేరు రాసి చచ్చిపోతానన్నాడు: విశాల్
హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటొని. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో విశాల్, సూర్య.. ఇద్దరూ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఆదివారం(సెప్టెంబర్ 10) జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విశాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నీ వల్లే నాకీ పరిస్థితి అంటూ.. అధిక్ రవిచంద్రన్.. దాదాపు తొమ్మిదేళ్ల కిందట ఓ స్టోరీ చెప్పాడు. ఓ నిర్మాత దగ్గరికెళ్తే ఇదసలు స్క్రిప్టేనా? అన్నాడు. అలా 40 మంది నిర్మాతలు బయటకు గెంటేశారు. బాధతో మరో కథ రాసుకున్నాడు. త్రిష ఇల్లనా నయనతార అనే సినిమా తీశాడు. అది బ్లాక్‌బస్టర్ హిట్. తర్వాత చేసిన ఓ సినిమా డిజాస్టర్ అయింది. ఒకరోజు నాకు ఫోన్ చేసి.. అన్నయ్య, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. అందులో నీ పేరు రాసి చచ్చిపోతాను అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే నేను మళ్లీ ఫోన్ చేసి నా పేరెందుకు రాస్తా అంటున్నావురా? అని అడిగాను. నువ్వు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాను, లేదంటే నేను ఇంకోలా ఉండేవాడిని అన్నాడు. ఏడేళ్లు వెయిట్ చేయించా అలా కాదురా, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఛాన్స్ వస్తుంది. తప్పకుండా కలిసి చేద్దాం అని చెప్పాను. ఏడేళ్లుగా వెయిట్ చేశాడు. ఇంతకాలానికి కలిసి మార్క్ ఆంటోని చేశాం. అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేస్తున్నాను అని చెప్పగానే చాలామంది నిర్మాతలు ఈ డైరెక్టర్‌తో ఎందుకు సర్? ఆయన సినిమాలు సరిగా ఆడలేదు, హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో వెళ్లవచ్చు కదా అని సూచించారు. నేను అతడి సినిమా ఎందుకు చేశాననేది సెప్టెంబర్ 15న మీ అందరికీ తెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు విశాల్. చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్ హీరో