ఓటీటీల వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు మన ముందుకొచ్చేస్తున్నాయి. అలానే ఈ మధ్య రిలీజైన ఈ మూవీ.. తెలుగు యావరేజ్ అనిపించుకున్నప్పటికీ తమిళంలో మాత్రం రూ.100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్నప్పటికీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు.
ఇంతకీ ఏ సినిమా?
విశాల్ తెలుగోడే. కానీ తమిళంలో హీరోగా సెటిలైపోయాడు. చాలా ఏళ్ల క్రితమే 'పందెం కోడి' లాంటి మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. అయితే గత కొన్నాళ్లల్లో అన్ని మూస చిత్రాలు చేస్తూ విసిగించాడు. అతడు కాస్త రూట్ మారి చేసిన సినిమా 'మార్క్ ఆంటోని'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు ఆడియెన్స్‌కి ఎక్కలేదు గానీ తమిళోళ్లు మాత్రం ఎగబడి మరీ చూశారు. దీంతో రూ.100 కోట్ల మేర వసూళ్లు దక్కాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్)
ఓటీటీలోకి అప్పుడే?
సెప్టెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కొన్నిచోట్ల ఇంకా థియేటర్లలో ఉంది. కానీ ఓటీటీ తేదీని ఇప్పుడు ఫిక్స్ చేసేశారు. అక్టోబరు 13 నుంచి అంటే ఈ శుక్రవారమే అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. సో అదన్నమాట విషయం. ఒకవేళ మీరేమైనా మిస్ అయ్యుంటే.. దీనిపై ఓ లుక్కేసేయండి.
కథేంటి?
సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్ చేసే టెలిఫోన్ కనిపెడతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) చనిపోవడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్‌జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. తండ్రిలా రౌడీ కాకూడదని మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అలాంటి ఇతడికి టైమ్ ట్రావెల్ చేసి టెలిఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ ద్వారా చనిపోయిన తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. అప్పుడో నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిజం? చివరికేమైంది అనేది 'మార్క్ ఆంటోని' కథ.
a laughter fest taking you beyond the dimensions of time! 🕰️#MarkAntonyOnPrime, Oct 13 pic.twitter.com/GmGjSfoku9
— prime video IN (@PrimeVideoIN) October 10, 2023
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment