
సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఎంత ఆనందపడతారో.. ఆ మూవీ తీసిన నిర్మాత అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే కోట్లు పెడతాడు కదా! అలా లాభాలు వచ్చిన ఆనందంలో చిత్రబృందానికి కళ్లు చెదిరే బహుమతులు ఇస్తుంటారు. మొన్నీమధ్య 'జైలర్' నిర్మాత కార్ల దగ్గర నుంచి గోల్డ్ కాయిన్స్ వరకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు మరో నిర్మాత.. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకున్నాడు.
(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)
హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అప్పుడెప్పుడో 'పందెం కోడి' లాంటి సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మన దగ్గర హిట్ కొట్టలేకపోయాడు. చాలా ఏళ్ల తర్వాత 'మార్క్ ఆంటోని'గా వచ్చిన విశాల్.. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
'మార్క్ ఆంటోని'లో విశాల్ కంటే ఎస్‌జే సూర్య నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగులో డీసెంట్ టాక్ అందుకుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్‌ని నిర్మాత వినోద్ సర్‌ప్రైజ్ చేశాడు. దాదాపు రూ.90 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Blockbuster #MarkAntony Prod Vinod gifted a BMW Car to Dir Adhik Ravichandran 👏
— Christopher Kanagaraj (@Chrissuccess) October 30, 2023
pic.twitter.com/KNirFQjFD4