కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్‌కే 'మార్క్ ఆంటోని' | Actor Vishal Court Issue Cleared For Mark Antony Movie Release, Deets Inside - Sakshi
Sakshi News home page

Mark Antony Movie Court Issue: 'మార్క్ ఆంటోని' సినిమాకు లైన్ క్లియర్

Published Tue, Sep 12 2023 6:16 PM | Last Updated on Tue, Sep 12 2023 6:35 PM

Actor Vishal Court Issue Mark Antony Movie - Sakshi

హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. 'మార్క్ ఆంటోని' విడుదల మీద కొన్నిరోజుల క్రితం మద్రాస్ కోర్టు స్టే విధించింది. కానీ తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయినట్లే. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!)

ఏంటి గొడవ?
గతంలో ఓ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర దాదాపు రూ.20 కోట్ల మేర అప్పు చేశాడు. అది తిరిగి చెల్లించే విషయంలో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్.. విశాల్ తమకు రూ.15 కోట్లు చెల్లించాలని, అప్పటివరకు 'మార్క్ ఆంటోని' రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడది విశాల్‌కి పాజిటివ్‌గా వచ్చింది.

'మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది' అని హీరో విశాల్ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది. 'మార్క్ ఆంటోని'లో ఎస్.జే.సూర్య కీ రోల్ చేశాడు. రీతూ వర్మ హీరోయిన్‌. సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, మహేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement