నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్‌ | Vishal Again Responded To CBFC And Thanked PM Modi | Sakshi
Sakshi News home page

Vishal To Modi: నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్‌

Published Sat, Sep 30 2023 11:42 AM | Last Updated on Sat, Sep 30 2023 12:54 PM

Vishal Again Respond To CBFC And Modi - Sakshi

సౌత్‌ ఇండియా హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్‌ కోసం సెన్సార్‌ బోర్డ్‌ వారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఇందుకు గాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకోసం ఒక సీనియర్‌ అధికారిని విచారించమని ముంబైకు కూడా పంపింది. అంతేకాకుండా CBFC వేధింపులకు ఎవరైనా గురై ఉండుంటే తగు సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా  కేంద్ర సమాచార శాఖ తెలిపింది.

(ఇదీ దచవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్‌)

ఈ విషయంపై  తాజాగా హీరో విశాల్‌ స్పందించాడు. 'కేంద్ర సమాచార, ప్రసార శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముంబైలో అవినీతి సమస్యకు సంబంధించిన ఈ ముఖ్యమైన విషయంపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాడం చాలా సంతోషం. నా ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగు చర్యలు ప్రారంభించారు. మీకు చాలా ధన్యవాదాలు. లంచం తీసుకున్నవారిపై తప్పక తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.. ఇదీ అవినీతిలో భాగమైన ప్రతి ప్రభుత్వ అధికారికి ఒక ఉదాహరణగా ఉంటుందని ఆశిస్తున్నాను.

దేశంలో అవినీతికి అడుగులు పడకుండా నిజాయితీ గల సేవా మార్గాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను.  నా ఫిర్యాదుతో వెంటనే రియాక్ట్‌ అయ్యేలా చూసిన నా ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండేలకు మరోసారి నా కృతజ్ఞతలు. ఈ కేసు విషయంలో తక్షణమే చొరవను తీసుకురావడం వల్ల నా లాంటి సామాన్యుడికి, ఇతరులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది. జై-హింద్..' అంటూ విశాల్‌ రియాక్ట్‌ అయ్యాడు. విశాల్‌ తనకు జరిగిన అన్యాయాన్ని మొదట X (ట్వటర్‌)లో తెలుపుతూ నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం  సోషల్‌ మీడియా ఖాతాలకు ట్యాగ్‌ చేసిన విషయం తెలిసిందే. 

(ఇదీ చదవండి: విశాల్​ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్‌.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement