వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో! | Silk Smitha Role In Vishal Movie Mark Antony | Sakshi

Silk Smitha: మళ్లీ తెరపై సిల్క్ స్మిత.. ఇక బావలు సయ్యా అనాల్సిందే!

Sep 12 2023 1:34 PM | Updated on Sep 12 2023 2:51 PM

Silk Smitha Role In Vishal Movie Mark Antony - Sakshi

తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న  సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మార్క్ ఆంటోని'. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ చిత్రంలో ఎస్‌ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్‌, ఎస్‌జే సూర్య ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళం, తెలుగు హిందీ భాషల్లో  రిలీజ్ చేయనున్నారు.

(ఇది చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!)

ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ‍ఈ ట్రైలర్‌ చూసిన అభిమానులు ఈ సినిమాలో దివంగత నటి సిల్క్ స్మితను చూసి షాక్ తిన్నారు. అయితే ఈ పాత్రను ఏఐ టెక్నాలజీ రూపొందించారని అందరూ భావించారు. అసలు మార్క్ ఆంటోనీ చిత్రంలో నిజంగానే సిల్క్ స్మిత పాత్ర కనిపించనుందా? ఆ ట్రైలర్‌లో ఉన్న నటి ఎవరు? అదేంటో తెలుసుకుందాం. 

'మార్క్ ఆంటోని' ట్రైలర్‌లో నటి సిల్క్ స్మితను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మొదటగా సిల్క్ స్మితను ఏఐ టెక్నాలజీ సాయంతో రీక్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అచ్చం సిల్క్‌ స్మితను పోలి ఉండే మరో తమిళ నటి మన ముందుకు రాబోతోంది. ఆమెనే విష్ణుప్రియా గాంధీ. సిల్క్ పాత్రలో విష్ణుప్రియా గాంధీ అచ్చం ఆమె పోలికతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అచ్చం సిల్క్ స్మిత సిస్టర్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: విశాల్‌ 'మార్క్‌ ఆంటోనీ' సినిమాపై బ్యాన్‌ విధించిన కోర్టు)

ఈ నేపథ్యంలో దీనిపై మార్క్ ఆంటోని మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి బాబు సైతం సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రకు సిల్క్ స్మితగా విష్ణుప్రియా గాంధీని తీర్చిదిద్దే అవకాశమిచ్చినందుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement