'జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌' ట్విటర్‌ టాక్‌.. రివ్యూ ఇచ్చిన ధనుష్‌ | Jigarthanda DoubleX Telugu Movie Twitter Review - Sakshi
Sakshi News home page

Jigarthanda Double X Movie: 'జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌' ట్విటర్‌ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

Published Fri, Nov 10 2023 8:41 AM | Last Updated on Fri, Nov 10 2023 9:24 AM

Raghava Lawrence and SJ Suryah Starrer Jigarthanda Double X Twitter Review - Sakshi

రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘జిగర్‌ తాండ డబుల్‌ ఎక్స్‌’. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్‌ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్‌ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. నిజానికి తొలి భాగంలో హీరోగా నటించే ఛాన్స్‌ లారెన్స్‌కు వచ్చినప్పటికీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేదు. 

ఫస్ట్‌ పార్ట్‌ మిస్‌.. సీక్వెల్‌లో ఛాన్స్‌
కానీ ఈ మూవీకి రెండు జాతీయ అవార్డులు రావడంతో సీక్వెల్‌ ఉంటే నటిస్తానని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుకు చెప్పాడు. అందుకు ఆయన ఓకే అన్నాడు. అలా సుమారు ఏడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా తెరకెక్కింది జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌. ఇందులో లారెన్స్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఎస్‌జే సూర్య దర్శకుడు కావాలనుకునే పాత్రలో కనిపించాడు. కార్తికేయన్‌ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేడు(నవంబర్‌ 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చివరి 40 నిమిషాలు..
కొన్ని చోట్ల మాత్రమే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడ్డాయి. చాలా చోట్ల ఇంకా షో పడకపోవడంతో సినిమా ఎలా ఉందనే టాక్‌ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అటు హీరో ధనుష్‌ మాత్రం జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ సినిమా చూసి ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీలో సూర్య, లారెన్స్‌ నటన చాలా బాగుందని, సినిమా చివరి 40 నిమిషాలు అదిరిపోయిందని రివ్యూ ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement