SJ Suryah Joins The Sets Of Shankar Ram Charan RC15 - Sakshi
Sakshi News home page

RC15: ఇట్స్‌ అఫీషియల్‌.. RC15లో ప్రముఖ నటుడు సూర్య

Published Fri, Sep 9 2022 3:35 PM | Last Updated on Fri, Sep 9 2022 4:47 PM

Sj Suryah Joins The Sets Of Shankar Ram Charan RC15 - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా శంకర్‌ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. దీనికి తగినట్లుగానే నటీనటులు, టెక్నీషియన్స్‌ విషయంలో ఏమాత్రం రాజీపడరాయన.

తాజాగా  RC15 కోసం ఓ స్టార్‌ యాక్టర్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు ఎస్‌.జే సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. సూట్‌ వేసుకొని చేతిలో ఫైల్‌ పట్టుకొని స్టైల్‌గా నడుస్తున్నట్లున్నఎస్‌.జే సూర్య పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement