‘స్క్విడ్ గేమ్’.. రెండేళ్ల క్రితం ఏ దేశంలో చూసిన ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ. ఈ వెబ్‌సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు ఉంది. ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన 'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2017లో వచ్చిన అభియోగాలపై ఈ 79 ఏళ్ల నటుడికి దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది.
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ హిట్ కావడంతో ఇటీవలే సీజన్ 2పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్‌లో కీలక పాత్రలో కనిపించిన దక్షిణ కొరియాకు చెందిన ఓ యోంగ్ సు (79) మీద లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడింది. సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది.
2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. 50 ఏళ్లుగా ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment