
ఓ పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వివాదంలో చిక్కుకోగా మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా రాబట్టింది. అందులో ఒక్క హిందీలోనే రూ.704 కోట్లు వసూలు చేయడం విశేషం.
అల్లు అర్జున్ పాడిన సాంగ్
ఇకపోతే మంగళవారం నాడు పుష్ప టీమ్ దమ్ముంటే పట్టుకోరా పాట (Dammunte Pattukora Song) రిలీజ్ చేసింది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ సాగుతుంది. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించాడు. రెండు మూడు లైన్లు మాత్రమే ఉన్న లిరిక్స్‌ను సుకుమార్ అందించాడు.
లక్షల వ్యూస్
యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. డిసెంర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వివాదంలో అల్లు అర్జున్
ఇదిలా ఉంటే డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్స్ వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లగా అక్కడ తొక్కిసలాట (Sandhya Theatre Stampede) జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా మరోసారి పోలీసులు బన్నీని విచారించడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: అమ్మాయిలు మిమ్మల్ని బకరాలను చేసి వాడుకుంటారు!: నటుడు