
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి ప్రలోభ పర్వం నడిపించింది. అదే టైంలో.. చెల్లని ఓట్ల విషయంలోనూ కుట్ర నడిపించింది. చెల్లని ఓట్లు లెక్కించొద్దన్న వైఎస్సార్‌సీపీ అభ్యంతరాల్ని కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదు. పైగా కౌంటింగ్ కేంద్రంలోకి రాకుండా అడ్డుకుని దొడ్డిదారిన గెలుపు కోసం ప్రయత్నించింది.



















