బరంపురం: గంజాం జిల్లా గురింటి గ్రామ శివారులో ఉన్న క్రషర్స్ కర్మాగారంలో గోడ కూలి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న సదర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కూలిన గోడ కింద ఉన్న మృతదేహాలను గ్రామస్తుల సహాయంతో వెలికితీసి 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఐఐసి అధికారి శివశంకర్ మహాపాత్రో, ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గురింటి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు క్రషర్స్ కర్మాగారంలో కార్మికులుగా పనికి వెళ్తుంటారు. ప్రతిరోజూ లాగానే పనిచేసేందుకు అన్నదమ్ములిద్దరూ శుక్రవారం వెళ్లారు. అయితే యూనిట్‌లో వారిద్దరూ పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా గోడ కూలడంతో అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఐఐసీ అధికారి తెలియజేశారు. అన్నదమ్ములిద్దరూ పనిచేస్తూ ప్రమాద స్థితిలో మృతిచెండంతో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని గురింటి గ్రామస్తులు క్రషర్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment