brothers died
-
మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. హవేళి ఘనపూర్ మండలంలోఅస్తికలు కలిపేందుకు నీటిలో దిగిన అన్నాదమ్ముళ్లు.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కామారెడ్డి సరిహద్దు పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అనారోగ్యంతో అన్న.. అంతలోనే తమ్ముడు.. తీవ్ర విషాదం..
మహబూబ్‌నగర్: పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. అన్నదమ్ములు ఇద్దరు భార్య, పిల్లలతో ఆనందంగా గడుపుతుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తమ్ముడిని మృత్యువు కబళించగా, అనారోగ్యం కారణంగా అన్న మృతి చెందాడు. అన్నదమ్ములు ఇద్దరు మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. జడ్చర్ల మున్సిపాలిటీలోని వెంకటేశ్వరకాలనీలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పూర్తి వివరాలిలా.. గంగారం శేఖర్ (38), గంగారం రవి (32) ఇద్దరు అన్నదమ్ములు. మున్సిపాలిటీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే, అన్న శేఖర్ కొంతకాలంగా అనారోగ్యానికి గురికావటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి భార్య ఉంది. అలాగే, తమ్ముడు రవికి భార్య సరిత, కూతురు ఉంది. కూతురిని తీసుకెళ్లేందుకు వెళ్లి మృత్యుఒడికి.. ఈ క్రమంలో రవి సోమవారం ఉదయం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును బోనాల పండగకు తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. ఉదయమే కావడంతో వాచ్మెన్ హాస్టల్ లోపలికి అనుమతించలేదు. మళ్లీ రావాలని చెప్పటంతో అక్కడి నుంచి భూత్పూర్ వైపు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు దివిటిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి మృతి చెందాడు. అతని వివరాలు ఏవీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. ఈ క్రమంలో అతడు ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు వెతకటం ఆరంభించారు. ప్రమాద విషయం తెలుసుకుని మార్చురీలో ఉన్న మృతదేహన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనారోగ్యంతో అన్న.. ఇదిలా ఉండగా, శేఖర్ అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండగా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇరువురి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జడ్చర్లలో నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటం, అంత్యక్రియలు నిర్వహించాల్సి రావటంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం అలుముకొంది. -
పెద్దకర్మకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.. ముగ్గురు సోదరులు మృత్యువాత
బాలాసోర్: ఒడిశా రైలుప్రమాద ఘటనలో పలు హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సంబంధిత కథనాలు జాతీయ మీడియాలో కనిపించాయి. అందులో ఒడిశాకు చెందిన రమేశ్ జెన అనే వ్యక్తి విషాదగాథ కూడా ఉంది. బాలేశ్వర్‌కు చెందిన ఒకావిడకు రమేశ్, సురేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడైన రమేశ్ చాలా సంవత్సరాల క్రితమే చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల రమేశ్ తల్లి కాలంచేశారు. దీంతో గత నాలుగు రోజుల క్రితం ఆయన సొంతూరు బాలేశ్వర్‌కు వచ్చారు. పెద్దకర్మ తదితర కార్యక్రమాలు చూసుకుని తిరిగి చెన్నైకి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోనే రమేశ్ ప్రయాణించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అన్న మృతిపై తమ్ముడు సురేశ్ మాట్లాడారు. ‘ తల్లిమరణంతో దాదాపు 14 సంవత్సాల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చారు. కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాక స్వయంగా నేనే అన్నను రైల్వేస్టేషన్లో దిగబెట్టారు. రైలు ఎక్కుతా నువ్వు వెళ్లిపో అని చెబితే సరేనన్నా. అన్నయ్యను చూడటం అదే చివరిసారి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. రాత్రిపూట రైలు ప్రమాదం వార్త తెల్సి వెంటనే అన్నకు ఫోన్‌చేశా. ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. కొద్దిసేపయ్యాక ఎవరో ఆ మొబైల్ నుంచి ఫోన్‌చేసి ప్రమాదంలో మీ అన్నయ్య చనిపోయాడని చెప్పారు. మరణవార్త విని హుతాశుడినయ్యా. పరుగున ఘటనాస్థలికి వెళ్లా. మొత్తం వెతికినా లాభంలేకుండా పోయింది. చివరకు బాలేశ్వర్ జిల్లా ఆస్పత్రిలో విగతజీవిలా పడి ఉన్న అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయా’ అని తమ్ముడు వాపోయాడు. ముగ్గురు సోదరులు మృత్యువాత బారుయిపూర్: బాలాసోర్ ప్రమాద ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ముగ్గురు సోదరుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ముగ్గురూ బతుకుదెరువు కోసం తమిళనాడుకు వెళ్తూ మృత్యువాతపడ్డారు. చరనిఖలి గ్రామానికి చెందిన హరన్ గయెన్(40), నిషికాంత్ గయెన్(35), దిబాకర్ గయెన్(32)లు ఏటా తమిళనాడుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురూ ఇటీవలే సొంతూరుకు వచ్చి, తిరిగి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై వెళ్తూ ప్రమాదంలో అసువులు బాశారు. ఈ వార్తతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన హరన్‌కు ఒక కొడుకు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లున్నారు. భార్య అనాజిత మానసిక సమస్యతో బాధపడుతోంది. నిషికాంత్‌కు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. దిబాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: అందుకే ఈ ప్రమాదం.. కోరమండల్ ప్రమాదం వేళ తెరపైకి కొత్త వాదన -
అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్వేర్.. ఊహించని రోడ్డు ప్రమాదంలో
సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు. వివరాలు.. హుజూరాబాద్ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఉగాది రోజు విషాదం.. విషవాయువుతో ఊపిరాడక అన్నాదమ్ములు మృతి
సాక్షి, భద్రాద్రి: ఉగాది పండగ రోజున ఓ వలస కార్మికుల కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. అట్టల ఫ్యాక్టరీలో పల్ఫ్ (పేపర్‌గుజ్జు) ఉండే బావిని శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అన్నదమ్ములు విషవాయువుతో ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఎస్ఎస్ అట్టల ఫ్యాక్టరీలో బుధవారం చోటుచేసుకుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫల్ప్ బావిని శుభ్రం చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కావాసి జోగా (21), కావాసి బుద్ధరామ్ (23) అనే వలస కార్మిక సోదరులు పది అడుగుల లోతు ఉన్న బావిలోకి నిచ్చెన సాయంతో దిగారు. వెంటనే ఇద్దరూ ఊపిరాడక కుప్పకూలారు. గమనించిన తోటి కార్మికులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని, వారిని బయటకు తీసేందుకు ఐదుగురు బావిలోకి దిగారు. వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో మరో ఇద్దరు కూడా విషవాయువులతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొగ్గలి రాంబాబును భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొదట బావిలోకి దిగిన వలస కారి్మకులను బయటకు తీసుకురాగానే బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కావాసి జోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుద్ధరామ్ భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మృతులిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కాంకిపొర గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది కారి్మకులు పని చేస్తున్నారు. సోదరులిద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో అక్కడున్న వారిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు! -
తల్లి మృతిని తట్టుకోలేక..
కీసర: తల్లి మృతిని తట్టుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డికి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు యాదిరెడ్డి(30) మహిపాల్‌రెడ్డి (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంగీత పాఠశాలలో పనిచేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లిసుశీల ఎనిమిది నెలల క్రితం కేన్సర్ వ్యాధితో మృతిచెందింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు. యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఈనెల 21న ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు. అయితే గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌చేసి చెప్పారు.వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్‌రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య
సాక్షి, కడప: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య విభేదాలతో ఇద్దరు మృతి చెందారు. సొంత అన్నపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. దాంతో అన్న తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో తమ్ముడిని కాల్చి చంపాడు. అనంతరం అన్న తానను తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివారాల్లో వెళ్తే... నల్లపురెడ్డిపల్లె గ్రామలో ఇద్దరు శివప్రసాద్‌రెడ్డి, పార్థసారధిరెడ్డి అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే మంగళవారం అన్న శివప్రసాద్‌రెడ్డిపై తమ్ముడు పార్థసారధిరెడ్డి గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం తన వద్ద లైసెన్స్ తుపాకీతో పార్థసారధిరెడ్డిని అన్న శివప్రసాద్‌రెడ్డి కాల్చి చంపాడు. అనంతరం తమ్ముడిని చంపాననే మనస్తాపంతో తన గన్‌తో కాల్చుకుని శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు! -
కరోనాతో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
సాక్షి, జనగామ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. గత నెల 27న జన గామకు చెందిన గోనె సుశీల కరోనాతో మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి జనగామలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఆమె కుమారుడు గోనెకృష్ణ (58), గంటల్లోనే ఆయన సోదరుడు ఐనవోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయం పర్యవేక్షకులు శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో ఒకే కుటుంబంలో కరోనాతో మూడు మరణాలు సంభవించడంతో విషాదం నెలకొంది. -
మొన్న తమ్ముడు.. నేడు అన్న
సాక్షి, వర్గల్(గజ్వేల్): వారిద్దరు అన్నదమ్ముల పిల్లలు.. ఒకే ప్రమాదం.. ఒక విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం. మొన్న తమ్ముడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు అన్న.. అయిదురోజుల వ్యవధిలో సోదరుల దుర్మరణం.. రెండు కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన రోడ్డు ప్రమాదం. వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో పెనువిషాదాన్ని మిగగిల్చింది. ఈ నెల 15న మంగళవారం ఉదయం తూప్రాన్ మండలం అల్లాపూర్ చౌరస్తావద్ద ఈ ప్రమాదం జరగగా అనంతగిరిపల్లికి చెందిన తుమ్మల అరవింద్ కుమార్ (15) అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తుమ్మల కరుణాకర్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అనంతగిరిపల్లిలో రైతు కుటుంబానికి చెందిన తుమ్మల రామకృష్ణ–లక్ష్మి దంపతుల కుమారుడు కరుణాకర్, అతడి చిన్నాన్న తుమ్మల లక్ష్మణ్–లత దంపతుల కుమారుడు(వరుసకు తమ్ముడు) అరవింద్ కుమార్‌లు 15న ఉదయం సమీప బంధువు కూతురును బైక్‌మీద తూప్రాన్ సమీప పరిశ్రమ వద్ద దింపేశారు. అక్కడి నుంచి గ్రామానికి తిరిగొస్తుండగా అల్లాపూర్ చౌరస్తావద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అక్కడికక్కడే అరవింద్ మృతి చెందగా, తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కరుణాకర్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఇంటర్ చదివిన కరుణాకర్ అవివాహితుడు. చదువు కొనసాగిస్తున్న దశలోనే ఇద్దరు మృత్యుపాలవడం, ఎదిగిన కొడుకులు కానరాని తీరాలకు చేరడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కరుణాకర్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
తోడబుట్టారు.. తోడై వెళ్లారు
ప్రొద్దుటూరు క్రైం: వారిద్దరూ ఒక తల్లి గర్భాన జన్మించారు.. ఆ తల్లి ఒడిలోనే పెరిగారు.. తమ్ముడంటే అన్నకు ప్రాణం.. అన్నంటే తమ్ముడికి ఎనలేని ప్రేమ.. తమ్ముడికి చిన్న కష్టమొచ్చినా అన్నయ్య భరించలేడు.. దేహాలు వేరైనా వాళ్లిద్దరి గుండె చప్పుడు ఒక్కటే.. పుడుతూ అన్నదమ్ములు.. పెరుగుతూ దాయాదులు అన్న నానుడిని వారు విచ్ఛిన్నం చేస్తూ కలసి మెలసి జీవించారు.. చివరికి మరణంలోనూ ఒకరి వెంట మరొకరిగా ప్రయాణించి తోబుట్టువుల బలీయమైన రక్తసంబంధానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలిచారు. అన్నదమ్ముల అనుబంధం.. అన్యోన్యతను చూసి ఈర్ష్య పడిన భగవంతుడు వాళ్లిద్దరిని తన అక్కున చేర్చుకున్నాడు. చిన్న నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటూ మరణంలోనూ నిజమైన తోబుట్టువులు అనిపించుకున్న విషాద ఘటన ప్రొద్దుటూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గోపవరం పంచాయతీ, కాల్వకట్ట వీధిలో నివాసం ఉంటున్న ఆవుల చంద్రమోహన్ (35) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. తమ్ముడి మరణంతో తీవ్రంగా కలత చెందిన అన్న బాలరాజు (45) మంగళవారం ఉదయం గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు కాల్వకట్టవీధిలో పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి.. ఆవుల చంద్రమోహన్ బేల్దార్ పనికి వెళ్లేవాడు. అతనికి భార్య మరియమ్మ, 11 ఏళ్ల ధరణి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తె ఐదో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి చంద్రమోహన్‌కు ఆరోగ్యం సరిగాలేదు. గుండె సంబంధిత వ్యాధితో పలుమార్లు ఆస్పత్రిలో చూపించుకొని మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి పరిస్థితి విషమంగా మారడంతో ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతను ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కాల్వకట్ట వీధిలోని అతని ఇంటికి తరలించారు. దూర ప్రాంతాల్లోని బంధువులు రావాల్సి ఉండటంతో మంగళవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించాలని భావించారు. చంద్రమోహన్ మరణాన్ని జీర్ణించుకోలేని అన్న బాలరాజు విలపించసాగాడు. రాత్రంతా తమ్ముడినే తలచుకుంటూ సొమ్మసిల్లాడు. కుటుంబ సభ్యులు ఎం త పిలిచినా లేవకుండా అలానే పడిపోయాడు. గుండె నొప్పిగా ఉందంటూ.. తమ్ముడి మరణంతో కలత చెందిన బాలరాజు మంగళవారం ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ఆయాస పడిన అతను చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే మృతి చెందాడు. చంద్రమోహన్ అంత్యక్రియల కోసం బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున వచ్చారు. ఒకరి కోసం వచ్చిన బంధువులు ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. బాలరాజు మృతితో భార్య సంజమ్మ విలపిస్తోంది. వారికి 14 ఏళ్ల అంజలి అనే కుమార్తె ఉంది. ప్రొద్దుటూరులోని వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి, చిన్నాన్న మరణంతో అంజలి రోదిస్తోంది. చిన్న వయసులో తండ్రులను పోగొట్టుకున్న అంజలి, ధరణిలను చూసి స్థానికులు, బంధువులు కంట తడిపెట్టారు. కూలి పని చేసుకొని జీవించే తమకు పెద్ద దిక్కు లేకుండా పోయారని, పిల్లల్ని ఎలా పోషించాలి దేవుడా అంటూ మృతుల భార్యలు విలపిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం.. చంద్రమోహన్, బాలరాజు మృతితో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరినీ కలచివేసింది. అన్నదమ్ములిద్దరూ రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో సొంత బంధువుల ఇళ్లల్లో పెళ్లి చేసుకున్నారు. వైఎఎస్సార్సీపీ నాయకులు దేవీప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓబుళరెడ్డి, శనివారపు సుబ్బరాయుడు తదితరులు విచ్చేసి మృతదేహాలకు నివాళులు అర్పించారు. -
అయ్యో.. వినాయకా!
బ్రహ్మ చేసిన బొమ్మలు బాలలైతే..బాలలు చేసిన బొమ్మ దేవుడుకాలేకపోయాడా..వేసవి సెలవుల్లో సంబరంగా గడపాల్సిన చిన్నారులు..నాలుగు నెలల ముందే చవితి సంబరం చేద్దామని..ముద్దు ముద్దుగా మట్టి ముద్దను పితికిబొజ్జ గణపయ్య ప్రతిమ చేసి..భక్తిభావంతో ముచ్చటగా పూజచేసి..నీట ముంచి నిమజ్జనం చేయబోతే.. ఆ నీటిలోనే మునిగి నిండు ప్రాణాలు వదిలి.. కన్నశోకం మిగిల్చి.. కడుపుకోత నింపిరి..కళ్లముందు చెంగుచెంగుమని గెంతాల్సిన తనయులుకట్టిలా నిర్జీవమై పడి ఉన్న బిడ్డలను చూసి..తల్లిదండ్రుల గుండె ‘చెరువు’ అయ్యిందిఅమడగూరు ఎస్సీ కాలనీ శోకసంద్రమైంది.. అమడగూరు: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకని వెళ్లి జలసమాధి అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన అమడగూరు ఎస్సీ కాలనీకి చెందిన పులగల్లు రామాంజినేయులు, నరసమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు సుమంత్ (10), సునీత్ (8). రామాంజనేయులు పెయింటర్‌గా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో సుమంత్ ఐదో తరగతి, సునీత్ మూడో తరగతి పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో ప్రతి రోజూ స్నేహితులతో కలిసి ఆడుకునేవారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు దేవగుడి చెరువులోని పెద్ద, చిన్న గుంతల్లో నీరు చేరింది. పక్కనే ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన పిల్లలంతా చెరువులో ఆడుకోవడానికి వెళ్లారు. వినాయక నిమజ్జనం కోసం వెళ్లి.. చెరువులో ఎక్కడ చూసినా బంకమట్టి ఉండటంతో పిల్లలు తమ చిట్టిచేతులతో వినాయకుడి బొమ్మలను తయారు చేశారు. అక్కడే కాసేపు ఆడుకున్న తర్వాత బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేయడానికి ఉపక్రమించారు. సునీత్ తన వినాయకుడి బొమ్మను తీసుకుని నీటిగుంతలోకి దిగాడు. అలా కొద్దికొద్దిగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో లోతైన ప్రదేశంలోకి చేరుకున్నాడు. మునిగిపోతున్న తమ్ముడిని చూసి కాపాడేందుకు ప్రయత్నించిన సుమంత్ కూడా మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి కాలనీలోకి పరుగులు తీసి జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే కాలనీవాసులు చెరువు వద్ద నీటి గుంతలోకి దిగి వెతకడం ప్రారంభించారు. గంటపాటు వెతికి అన్నదమ్ముల (సుమంత్, సునీత్‌ల)ను బయటకు తీయగా.. అప్పటికే వారు విగత జీవులుగా మారిపోయారు. తల్లిదండ్రుల అరణ్యరోదనలు ఉన్న ఇద్దరు కుమారులు జలసమాధి కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఆసరా ఎవరు స్వామీ, మీరు లేకుంటే ఇక మేమెందుకంటూ పేగు బంధం తెంచి జన్మనిచ్చిన ఆ తల్లితండ్రులు విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ప్రతి ఒక్కరి కళ్లూ నీటితో నిండిపోయాయి. ఎస్ఐ రాఘవయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మృత్యువులోనూ వీడని బంధం
చివ్వెంల (సూర్యాపేట) : మృత్యువులోను వారి బంధం వీడలేదు. వరుసకు సోదరులైనప్పటికీ స్నేహితులలాగే కలిసి మెలిసి తిరుగు తూ ఉండేవారు. వారిని బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. మండల పరిధిలోని కుడకుడ గ్రా మానికి చెందిన చీమకండ్ల కాశయ్య, దీవెనమ్మ పెద్ద కుమారుడు చీమకండ్ల ఉదయ్ (22) వృత్తిరీత్యా జనగాం క్రాస్‌రోడ్డులో ఓ హో టల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చీమకండ్ల ఎల్లయ్య, జయమ్మల మూడవ కుమారుడు మన్మథ (24) వృత్తిరీత్యా సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆత్మకూర్. ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి సొంత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా మా ర్గమధ్యలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై కుడకుడ గ్రామ శివారులో జీఎంఆర్ టౌన్షిప్ వద్ద వరంగల్ నుంచి సూర్యాపేట వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మన్మథ, ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను అరగంట సేపు వరకు ఎవరూ చూడలేదు. అనంతరం మండల పరిధిలోని గాయంవారిగూడెం గ్రామం వైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి చివ్వెంల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్.నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. వారి వద్ద ఉన్న కొన్ని గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మన్మథ గత పదిహేను రోజుల క్రితం బైక్‌ను కొనుగోలు చేశారు. మృతులు ఇద్దరూ అవివాహితులు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. -
కలిసి వెళ్లారు.. కన్నుమూశారు
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె : సుండుపల్లె–రాయవరం రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయవరానికి చెందిన సిద్దిక్ కుమారులు మహ్మద్ రఫీక్ (45) అతని సోదరుడు ఇలియాస్ (42) శుక్రవారం ఉదయం రాయవరం నుంచి సుండుపల్లెకు తమ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో రాయవరం క్రాస్ మడితాడు మధ్యలోని మలుపులో రాయచోటి నుంచి పింఛాకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరి తలలకు బలమైన గాయాలు తగిలి ఇలియాస్ (42) అక్కడికక్కడే మృతి చెందగా మహమ్మద్ రఫీక్ (45)ను స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం సుండుపల్లె ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో సోదరులను మృత్యువు కబళించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతులు మహ్మద్ రఫీక్‌కు భార్య కుమారుడు, కుమార్తె, ఇలియాస్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. విషాదంలో రాయవరం :ఇంట్లోనుంచి బయలుదేరిన అయిదు నిమిషాల్లోనే జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో మృతుల స్వగ్రామం రాయవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పరామర్శ :సుండుపల్లె మండల పర్యటనలో ఉన్న రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిలు వెంటనే ప్రమాదస్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి రూ.10వేలు అందజేశారు. ప్రమాదస్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు కరీంబాషా తదితరులు సందర్శించారు. -
విషాదం నింపిన విహారం
ఉట్నూర్‌రూరల్: సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్నిక్ వెళ్లారు. మత్తడి ప్రాజెక్టు వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్లే సమయంలో ఫొటోలు దిగేందుకు ప్రాజెక్టులోకి దిగడంతో ప్రమాదవశాత్తు తమ్ముడు నీట మునిగాడు. కాపాడబోయిన అన్న కూడా నీటి మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ హృదయ విదారక సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరే సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలివీ.. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ గ్రామానికి చెం దిన జాదవ్ ప్రహ్లద్–బిజ్జుబాయిలకు అరుణ్(14), తరుణ్ (16) ఇద్దరు సంతానం. సెలవులు కావడంతో ఉట్నూర్‌లో ఉంటున్న పెద్దమ్మ కూతు రు శిల్ప ఇంటికి వచ్చారు. వారి పిల్లలతో కలిసి ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడిగూడ చెరువు వద్దకు పిక్నిక్కు వచ్చారు. దినమంతా సరదాగా గడిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక మధ్యాహ్నం ఇంటికి వెళ్దామనుకునే సమయంలో కాసేపు నీళ్లతో ఆడుకుంటూ ఫొటోలు దిగుదామని ప్రాజెక్టులో దిగారు. లోతు తెలియక..ఈతరాక ఒక్కసారిగా అన్నదమ్ముళ్లలో అరుణ్ మునిగి పోతుండగా తమ్ముని కాపాడబోయి తరుణ్ కూడా నీట మునిగాడు. కుటుంబ సభ్యులు అరుపులు.. కేకలు వేయడంతో మత్తడిగూడ గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ప్రాజెక్టు లోతు ఉండటంతో మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు దాదాపు గంటసేపు గాలించి బయటకు తీశారు. కాగా అరుణ్ మండల కేంద్రంలోని సన్‌షైన్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, తరుణ్ స్థానిక పూలాజీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సైలు ఎల్వీ రమణ, జగన్మోహన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ప్రçహ్లద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద రక్షణ కరువు మండల కేంద్రంలోనే పేరుగాంచిన ఈ ప్రాజెక్టు వద్ద రక్షణ కరువైంది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా తవ్వకాలు జరపడంతో చెరువు లోతు తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం కం చెలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
తోడేళ్లగూడెంలో విషాదఛాయలు
డోర్నకల్ (వరంగల్): విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. అన్నదమ్ములు తేనె రమేష్(50), తేనె జగన్(47) మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన తేనె సహదేవ్, వెంకటమ్మకు నలుగురు కుమారులు రమేష్, జగన్, సతీష్, వెంకన్న ఉన్నారు. సహదేవ్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. గ్రామం నుంచి బొడ్రాయి తండా మార్గంలో ఉన్న భూమిని నలుగురు కుమారులకు పంపిణీ చేశారు. వ్యవసాయ భూమిలో కుమారులు వేర్వేరుగా పత్తిపంటను సాగు చేస్తున్నారు. దుక్కి దున్ని ఎరువు చల్లేందుకు రమేష్, జగన్ వేర్వేరుగా అరకలు తీసుకుని బుధవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. రమేష్ అరకు దున్నుతున్న క్రమంలో పత్తి చేను మీదుగా వ్యవసాయ బావి వద్దకు అమర్చిన విద్యుత్ లైను తీగ తెగి పడింది. అది తగిలి రమేష్ చనిపోయాడు. అన్న రమేష్‌ను కాపాడబోయి జగన్ కూడా విద్యుదాఘాతంతో క్షణాల్లో మృతి చెందాడు. పత్తి చేను వద్దకు పరుగులు.. విద్యుదాఘాతంతో అన్నదమ్ములు రమేష్, జగన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న గ్రామస్తులు పత్తి చేను వద్దకు పరుగులు పెట్టారు. ఇద్దరి మృతదేహాలను వెంటనే ఇంటికి చేర్చారు. రోడ్డుకు ఇరువైపులా రమేష్, జగన్ ఇళ్లు ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన మహిళల రోదనలు మిన్నంటాయి. రమేష్, జగన్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ మండలానికి సుపరిచితులు కావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లి.. తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసిన తల్లి వెంకటమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. కొద్దిసేపు రమేష్ ఇంటికి, కొద్దిసేపు జగన్ ఇంటికి వెళ్లి మృతదేహాల వద్ద విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. జగన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, రెండో కుమార్తె ఇంటర్, మూడో కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు. ఉదయమే పిల్లలు కళాశాలకు వెళ్లారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని వెంటనే ఇంటికి చేరుకున్నారు. నవ్వుతూ కళాశాలకు పంపిన తండ్రి విగతజీవిగా మారి కనిపించడంతో ముగ్గురు పిల్లల రోదనలు మిన్నంటాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ.. సంఘటన స్థలాన్ని డోర్నకల్ సీఐ జక్కుల శ్యాంసుందర్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరు గురించి చుట్టు పక్కన వ్యవసాయ భూములకు చెందిన రైతులను విచారించారు. ఘటనకు కారణమైన విద్యుత్ తీగను సేకరించారు. అనంతరం శవ పంచనామా పూర్తి చేసి మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సబ్‌మెరైన్ మోటార్లకు వినియోగించే వైరు.. తోడేళ్లగూడెం సమీపంలో రమేష్, జగన్‌కు చెందిన వ్యవసాయ బావికి మెయిన్ లైన్ నుంచి అమర్చిన విద్యుత్ వైరు వ్యవసాయ బావుల్లోని సబ్ మెరైన్ మోటర్లకు వినియోగించేదని విద్యుత్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. స్తంభాల మీదుగా సర్వీస్ వైరు (సబ్‌మెరైన్ మోటర్లకు వినియోగించేది)తో లైను ఏర్పాటు చేసుకున్నారు. సన్నగా ఉండే వైరు తెగి పత్తి చేనులో పడడం, అది గమనించక రమేష్, జగన్ మృత్యువాత పడ్డారు. రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్ రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్ -
గోడకూలి అన్నదమ్ముల మృతి
బరంపురం: గంజాం జిల్లా గురింటి గ్రామ శివారులో ఉన్న క్రషర్స్ కర్మాగారంలో గోడ కూలి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న సదర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కూలిన గోడ కింద ఉన్న మృతదేహాలను గ్రామస్తుల సహాయంతో వెలికితీసి 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఐఐసి అధికారి శివశంకర్ మహాపాత్రో, ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గురింటి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు క్రషర్స్ కర్మాగారంలో కార్మికులుగా పనికి వెళ్తుంటారు. ప్రతిరోజూ లాగానే పనిచేసేందుకు అన్నదమ్ములిద్దరూ శుక్రవారం వెళ్లారు. అయితే యూనిట్లో వారిద్దరూ పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా గోడ కూలడంతో అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఐఐసీ అధికారి తెలియజేశారు. అన్నదమ్ములిద్దరూ పనిచేస్తూ ప్రమాద స్థితిలో మృతిచెండంతో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని గురింటి గ్రామస్తులు క్రషర్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
బస్సు ప్రమాదంలో అన్నదమ్ముల విషాదగాథ
-
అన్యోన్య బంధం ఆవిరైంది
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య తమ్ముడి మరణం జీర్ణించుకోలేకే.. తనయుల మృతితో తల్లడిల్లిన తల్లి వారిద్దరూ అన్నదమ్ములు.. వయసు తేడా ఉన్నా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఆడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధం వారిది. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు.. ఏది చేసినా తోడుగా ఉండేవారు.. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న అన్నదమ్ముల జీవితాన్ని విధి వెక్కిరించింది. ఉన్నత విద్యలో సరైన ‘మార్గదర్శకులు’ లేక మానసిక వేదనకు గురై నాలుగునెలల క్రితం తమ్ముడు రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. నీడలా ఉండే తమ్ముడు తన వెంట లేకపోవడం శూన్యంలా అనిపించడంతో అన్న కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘దేవుడా కన్నకొడుకులిద్దరినీ కళ్లముందు లేకుండా తీసుకుపోతివా?’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. - పామిడి పి.కొండాపురం రైల్వేగేట్ పెద్దమ్మ గుడి సమీపాన శనివారం రాత్రి బీటెక్ విద్యార్థి ఎన్.రవికుమార్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పామిడిలోని ఎద్దులపల్లిరోడ్డులో నివాసమున్న నల్లబోతుల రామాంజనేయులు, నాగరత్నమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఎన్.రవికుమార్ (19), ఎన్.పవన్‌కుమార్ (16) సంతానం. రామాంజనేయులు బోర్వెల్ పనులకు కూలికెళ్తుంటాడు. భార్య నాగరత్నమ్మ మినీ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త. చిన్నకుమారుడు ఎన్.పవన్‌కుమార్ పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. అయితే పది తర్వాత ఏ కోర్సులో చేరాలన్న విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆటో మొబైల్ కోర్సులో చేరాడు. ఇది సరైనది కాదని అనుకున్నాడో ఏమో గత ఏడాది సెప్టెంబర్ 25న ఎద్దులపల్లిరోడ్డులోని టంగుటూరి చిన్నప్పశ్రేష్టి తోట సమీపాన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎన్.రవికుమార్ అప్పట్లోనే బలవన్మరణానికి యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని వారించారు. ప్రస్తుతం రవికుమార్ గుత్తి గేట్స్కాలేజ్లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి శనివారం సాయంత్రం ఇంటికి చేరాడు. రాత్రి కలిసి భోజనం చేయాలని తల్లిదండ్రులు రవికుమార్‌తో అన్నారు. అంతలోనే బయటకు వెళ్లొస్తానంటూ బయల్దేరాడు. అలా వెళ్లిన అతను రాత్రికి రాత్రే రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అనంతలో డెంగీతో అన్నదమ్ముల మృతి
-
డెంగీతో అన్నదమ్ముల మృతి
అనంతపురం సిటీ : అనంతపురం నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఎండీ ఇద్రీస్(12) , మహ్మద్ జునైద్(10)డెంగీతో గురువారం బెంగళూరులో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం ఇద్రీస్, అతని సోదరుడు జునేద్‌లకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వైద్యుడు చిన్నారులను బెంగళూరుకు తీసుకువెళ్లాలని సూచించాడు. దీంతో వారిని బెంగళూరులోని నానో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం ఇద్రీస్, మహ్మద్ జునైద్ మృతి చెందారు. తన ఇద్దరు బిడ్డలకూ మాయదారి రోగం సోకిందని వారిని బతికించేలా ప్రార్థించాలని ఇద్రీస్ తండ్రి ఖలందర్ అనంతపురం నగరంలోని పలువురి వాట్సప్ ద్వారా సందేశం పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు విలపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో డెంగీ కేసులు రోజుకొకటి నమోదవుతున్నా, గురువారం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా తమకు సమాచారం తెలియదంటూ డీఎంహెచ్ఓ చెప్పడం గమనార్హం. -
చెట్టును ఢీకొన్న బైక్
పెద్దాపురం : అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన ఇది. ఆర్బీ కొత్తూరు గ్రామానికి చెందిన బయ్యా శ్రీను(27), బయ్యా శివ(22) వ్యవసాయ కూలీలు. ఏడాదిన్నర క్రితం శ్రీనుకు వివాహమైంది. అతడికి భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. కాగా సోమవారం శ్రీను, శివ కలిసి రాజమండ్రిలో బైక్ ఫైనాన్స వాయిదా చెల్లించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటాక ఆర్బీ కొత్తూరు సమీపానికి వచ్చేసరికి మోటార్ బైక్ అదుపుతప్పింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీను, శివ అక్కడికక్కడే చనిపోయారు. కాగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వారి బంధువులు.. మృతదేహాలను తరలించారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై వై.సతీష్ తెలిపారు. -
విద్యుదాఘాతం.. సోదరుల మృతి
ముదిగుబ్బ (అనంతపురం): విద్యుదాఘాతంతో ఇద్దరు సోదరులు మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోదరులు నర్సింహులు, తిమ్మప్ప మంగళవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లారు. ముందుగా ఒకరు మోటార్ అన్ చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి లోనై కేకలు వేయగా... కాపాడే ప్రయత్నంలో రెండో వ్యక్తి కూడా షాక్‌కు గురై మృతి చెందారు. ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయి కనిపించారు. -
మోటార్ వేయడానికి వెళ్లి.. చిన్నారుల మృతి
కేసముద్రం : పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన అన్నదమ్ములు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం గుడితండాలో జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తండాలో విషాదం నెలకొంది. వాల్కి అనే మహిళ భర్తను కోల్పోవడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి.. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతోంది. బుధవారం పొలంలో మోటార్ ఆనే చేసి రమ్మని తల్లి వాల్కి కుమారులైన సురేష్, నరేష్ లను పంపింది. అయితే, పొలంలో విద్యుత్ తీగ తెగి గట్టుపై పడిపోయింది. అది చూసుకోకుండా వెళ్లిన పిల్లల కాళ్లకు ఆ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో ఇద్దరూ మృతి చెందారు. పొలానికి వెళ్లిన పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి తల్లి వాల్కీ వెళ్లి చూడగా పిల్లలు విగతజీవులుగా కనిపించారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
వాహనం ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం..
తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై లాలప్ప(25), ఆశప్ప(23)లు తాండూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఢీకొట్టిడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడతో వీరి స్వగ్రామం చెంగోలులో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వైద్యం వికటించి అసువులు బాసిన సోదరులు
శాంతినగర్(మహబూబ్‌నగర్): మద్యం మాన్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నాటువైద్యం వికటించి సోదరులు వరుసయ్యే ఇద్దరు చనిపోయారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం రాజోలి గ్రామానికి చెందిన నాగన్న(30) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు తమ్ముడైన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామానికి చెందిన భాస్కర్(28) అలియాస్ రాజుతో కలసి తరుచూ మద్యం తాగేవాడు. మద్యం వ్యసనం నుంచి దూరం చేయాలని సంకల్పించిన బావమరిది సుధాకర్ వారిద్దరినీ కర్నూలు జిల్లా సోముల గూడూరులో ఉన్న నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చెట్టుపసరు తాగిన అనంతరం తిరిగి ఆటోలో గ్రామాలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం నాగన్న, భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వైద్యుడికి చూపించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు ఢీకొని అన్నదమ్ముల మృతి
చౌటుప్పల్/పెద్దఅంబర్‌పేట:బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్తున్న ముగ్గురు అన్నదమ్ములను రోడ్డు ప్రమాదం బలిగొంది. స్కూటర్‌పై వెళ్తున్న వారిని మృత్యుశకటంలా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన 65వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండజిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని దండుమైలారం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు...రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన పిట్టల మథార్-పెంటమ్మ దంపతులకు దశరథ(50), యాదగిరి(46), చంద్రయ్య(43), సహదేవ్, రవి కుమారులు. మథార్ అన్న చిత్తారికి సంతానం కలగకపోవడంతో, యాదగిరిని చిన్నప్పటి నుంచే పెంచుకుంటున్నాడు.దశరథ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా..., యాదగిరి స్వగ్రామంలోనే గ్రామసేవకుడిగా, చంద్రయ్య స్థానికంగా ఉన్న టీఎన్ఆర్ రెడీమిక్స్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామంలో పాలివారి పెళ్లితో పాటు, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో సహదేవ్ భార్య బంధువుల పెళ్లి ఉంది. పాలివారి పెళ్లికి వీరి భార్యలు, బంధువుల పెళ్లికి భర్తలు వెళ్లాలనుకున్నారు. దశరథ, యాదగిరి, చంద్రయ్య కలిసి స్కూటర్‌పై ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని దండుమైలారం క్రాస్‌రోడ్డు వద్ద, హైవేను దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వీరి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ గాల్లోకి లేచి, 120 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలకు పోలీ సులు చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి సాయంత్రం బంధువులకు అప్పగించారు. బాటసింగారంలో తీవ్రవిషాదం... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదంలో మృతి చెందడం తో బాటసింగారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పది నిమిషాల ముందు ఇంటి నుంచి వెళ్లిన దశరథ, యాదగిరి, చంద్రయ్య మృత్యువాతపడ్డారని తెలిసి వారి భార్యలు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఘటనా స్థలానికి వచ్చి చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలపై పడి వారు రోదించడం చూసి బంధువులు, స్థానికులు కంటనీరు పెట్టారు. మృతదేహాలను చూసేందుకు గ్రామస్తులతో పాటు పక్కగ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా, మృతుడు దశరథకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె, యాదయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, చంద్రయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ హాజరై మృతులకు నివాళులర్పించారు. అతివేగంతోనే ప్రమాదం... జాతీయ రహదారిని నాలుగులేన్లుగా విస్తరించాక కార్ల వేగానికి అడ్డు లేకుండా పోయింది. గంటకు 150 కి.మీ.లకు మించి వేగంతో కార్లు పరుగులు పెడుతున్నాయి. దశరథ, యాదగిరి, చంద్రయ్యలను బలిగొన్న ప్రమాదానికి కూడా అతివేగమే కారణం. స్కోడా కారు 150కి మించిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో, స్కూటర్‌తో పాటు, దానిపై ఉన్న ముగ్గురూ గాల్లోకి లేసి, 120 అడుగుల దూరంలో పడటంతో మృతి చెందారు. స్కూటర్ కూడా నుజ్జునుజ్జై ఏ భాగానికి ఆ భాగం విడిపోయాయి. -
కాటేసిన కరెంట్
నీరు లేక పొలాలు ఎండిపోతుండడాన్ని చూసి ఆ ఇద్దరు రైతులు తట్టుకోలేకపోయారు. ట్రాన్సఫార్మర్ మరమ్మతులకు స్వయంగా పూనుకున్నారు. ఫ్యూజ్ వేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన గంగాధరనెల్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గంగాధరనెల్లూరు, న్యూస్‌లైన్: మండలంలోని వెజ్జుపల్లెకు చెందిన బొజ్జారెడ్డి కుమారుడు ప్రశాంత్(26), గోవిందరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి(40) వరుసకు అన్నదమ్ములు. వ్యవసాయంతో కుటుంబాలను పోషిస్తున్నారు. పొలాల వద్దనున్న ట్రాన్సఫార్మర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. మరోవైపు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ప్రశాంత్, నరసింహారెడ్డి గ్రామంలోని ట్రాన్సఫార్మర్ వద్దకు మంగళవారం వెళ్లారు. ఫ్యూజ్ పోయినట్లు గుర్తించారు. ప్రశాంత్ పైకి ఎక్కి ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. రక్షించేందుకు కింద ఉన్న నరసింహారెడ్డి ప్రశాంత్‌ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ షాక్‌కు గురై మృతి చెందారు. ప్రశాంత్ అవివాహితుడు. నరసింహారెడ్డికి భార్య చిన్ని(35), కుమారులు నవీన్ (10 ) ఉదయ్( 9 ), కుమార్తె పద్మిని (7) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ ఎస్ఐ ధరణీధర్, ఏఎస్ఐ రాజేంద్రన్ పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేదని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సాధారణంగా ఉదయం 9 గంటలకు విద్యుత్ సరఫరా పోతే రాత్రి వరకు రాదన్నారు. ఇందుకు భిన్నంగా మంగళవారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు విద్యుత్ సరఫరా రావడంతో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్కు ఆన్ ఆఫ్ లేక పోవడంతోనే విద్యుత్‌షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత జరిగినా ఏ ఒక్క అధికారీ ఇక్కడికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్ని ఓదార్చిన నారాయణస్వామి బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే ఆయన వెజ్జుపల్లెకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రెండునెలల వ్యవధిలో గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో విద్యుత్‌షాక్‌తో ముగ్గురు మృత్యవాత పడ్డారన్నారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఈయన వెంట సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చిన్నమరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాయనిరెడ్డి, భాస్కరరెడ్డి, చంద్రబాబురెడ్డి పాల్గొన్నారు. సమాచారం ఇవ్వలేదు: గుర్రప్ప, ఏఈత్రీ ఫేస్‌కు సంబంధించి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాం. అయితే సింగిల్ ఫేస్‌లో సరఫరా ఇస్తున్నాం. ట్రాన్సఫార్మర్ పాడైన విషయం, మరమ్మతులు చేస్తున్న సమాచారం రైతులు మాకు తెలియజేయలేదు. 10జిడిఎన్‌సి 01: ప్రశాంత్ (ఫైల్‌ఫొటో) 02: నరసింహారెడ్డి (ఫైల్‌ఫొటో) 03: మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 06: ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న నారాయణస్వామి -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
బీర్కూర్, న్యూస్‌లైన్: బతికున్నంత కాలం కలిసిమెలిసి ఉన్న ఆ అన్నదమ్ములను మృత్యువు ఒకేసారి తీసుకెళ్లింది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయిన గంగరాజులు, సాయిప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. మృతుల బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ గ్రామానికి చెందిన సత్యం, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో గంగరాజులు(28) పెద్దవాడు. సాయిప్రసాద్ (21) చిన్నవాడు. గంగరాజులుకు 7 నెలల క్రితం గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ప్రతినెల మాదిరిగా శనివారం గంగరాజులు తండ్రి సత్యం ప్రియాంకను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి నెలవారి చెకప్‌కు తీసుకెళ్లాడు. అయితే అత్యవసరం కావడంతో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తండ్రి నుంచి ఫోన్ రావడంతో అన్నదమ్ములు తెలిసినవారి మోటర్‌సైకిల్ తీసుకుని నిజామాబాద్ వెళ్లారు. ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న సాయిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగరాజులును జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించేలోపే మృతి చెందాడు. దీంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బీర్కూర్‌కు తీసుకెళ్లారు. అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.