
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కడప: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య విభేదాలతో ఇద్దరు మృతి చెందారు. సొంత అన్నపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. దాంతో అన్న తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో తమ్ముడిని కాల్చి చంపాడు. అనంతరం అన్న తానను తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివారాల్లో వెళ్తే... నల్లపురెడ్డిపల్లె గ్రామలో ఇద్దరు శివప్రసాద్‌రెడ్డి, పార్థసారధిరెడ్డి అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.
కొంత కాలంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే మంగళవారం అన్న శివప్రసాద్‌రెడ్డిపై తమ్ముడు పార్థసారధిరెడ్డి గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం తన వద్ద లైసెన్స్ తుపాకీతో పార్థసారధిరెడ్డిని అన్న శివప్రసాద్‌రెడ్డి కాల్చి చంపాడు. అనంతరం తమ్ముడిని చంపాననే మనస్తాపంతో తన గన్‌తో కాల్చుకుని శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
చదవండి: అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు!
Comments
Please login to add a commentAdd a comment