కేసముద్రం : పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన అన్నదమ్ములు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం గుడితండాలో జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తండాలో విషాదం నెలకొంది.
వాల్కి అనే మహిళ భర్తను కోల్పోవడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి.. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతోంది. బుధవారం పొలంలో మోటార్ ఆనే చేసి రమ్మని తల్లి వాల్కి కుమారులైన సురేష్, నరేష్ లను పంపింది. అయితే, పొలంలో విద్యుత్ తీగ తెగి గట్టుపై పడిపోయింది. అది చూసుకోకుండా వెళ్లిన పిల్లల కాళ్లకు ఆ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో ఇద్దరూ మృతి చెందారు. పొలానికి వెళ్లిన పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి తల్లి వాల్కీ వెళ్లి చూడగా పిల్లలు విగతజీవులుగా కనిపించారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.