అటవి మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వేటగాడు మృతిచెందాడు.
అటవి మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వేటగాడు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం భూపతిపురం అటవీ ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. కన్నయగూడెం గ్రామానికి చెందిన వాసం రమేష్(30) అడవిపందులను వేటాడటం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు కాలికి తాకడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.