
చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. పూదూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల గోడ కూలి నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కునియముత్తూర్‌లోని సుకునపురం కృష్ణ కళాశాల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రహారీ గోడ కూలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురు పనుల కోసం వచ్చిన వలస కూలీలుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment