
ఇందర్‌సింగ్ (21)
అబిడ్స్: పాతబస్తీలోని మంగళ్‌హాట్, మచిలీపురకు చెందిన ఇందర్‌సింగ్ (21) గాలి దుమారంతో ఇంటిపై పక్క బిల్డింగ్ పెంట్‌హౌస్ మీదనుంచి సిమెంట్ దిమ్మె పడటంతో అక్కడికక్కడేమృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మచిలీపురలోని రేకులఇంటిలో ఇందర్ సింగ్, ఆయన తల్లిదయాబాయ్ (55) నివాసముంటున్నారు. ఇందర్‌సింగ్ బేగంబజార్ మచ్చీ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. అతని ఇంటి పక్కన నివసించే గణేశ్ సింగ్ 3 అంతస్తుల భవనంపై రేకుల షెడ్డు నిర్మించాడు.
రేకుల షెడ్డుపై నిర్మించిన సిమెంట్ దిమ్మె గాలి దుమారానికి ఇందర్ సింగ్ రేకుల ఇంటిపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి దయాబాయ్‌కి కాలు విరగడంతో స్థానికులు, గోషామహల్ కార్పొరేటర్ ముఖేశ్ సింగ్‌లు కలిసి చికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రిఇకి తరలించారు. ఇందర్ సింగ్ కుటుంబానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రణ్‌వీర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment