
మేయర్, కమిషనర్‌కు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ : జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్కు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని చంద్రలోక్ కాంప్లెక్సులో సోమవారం సాయంత్రం గోడ కూలి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలాన్ని మేయర్, కమిషనర్‌లు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు.
యాభై ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం ఏ క్షణాన్నైనా కూలవచ్చనే అనుమానంతో భవన సముదాయాన్ని, ఆ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. అటు వైపు ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, మేయర్, కమిషనర్‌లు వెళ్లిన కాసేపటికే మరో అంతస్తు గోడ కుప్పకూలింది. అందరూ వెళ్లిన తర్వాత గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.