Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

media briefing on Operation Sindoor by Director General of Military Operations1
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్‌ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌.కానీ పాకిస్తాన్‌ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్‌ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్‌ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్‌ వివిధ రాకల డ్రోన్‌లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్‌ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడి చేసింది. ఈ దాడిలో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్‌ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్‌ రేంజ్‌ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్‌ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్‌ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్‌ ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్‌ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.

Operation Sindoor: Live Updates as PM Modi to Address the Nation at 8 PM2
రాత్రి 8 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రధాని మోదీ ఫస్ట్‌ రియాక్షన్‌

ఢిల్లీ : అపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ(సోమవారం) రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌ -పాకిస్తాన్‌ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్‌ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్‌ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్‌ సిందూర్‌ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే,జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనేది ఉత్కంఠగా మారింది.

Shubman Gill Set To Join MS Dhoni In Unwanted List If He Becomes India's Test Captain3
గిల్‌ టీమిండియా కెప్టెన్‌ అయితే ధోనితో పాటు ఓ చెత్త రికార్డును షేర్‌ చేసుకుంటాడు..!

రోహిత్‌ శర్మ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్‌ గిల్‌ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్‌కు భారత టెస్ట్‌ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. టెస్ట్‌ల్లో గిల్‌కు అంత మంచి ట్రాక్‌ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఐ పెద్దలు అతనివైపే మొగ్గుచూపుతున్నారు. బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆప్షన్స్‌ ఉన్నా ఆల్‌ ఫార్మాట్‌ ఆటగాడని గిల్‌ను వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్‌ సారథ్యంలోనే భారత్‌ కఠినమైన ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుందన్న విషయం స్పష్టమవుతుంది. మరో రెండు రోజుల్లో గిల్‌ బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో భేటి కానున్నాడని తెలుస్తుంది.ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్‌ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్ ధోనితో కలిసి ఓ చెత్త రికార్డును షేర్‌ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అపప్రదను మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనితో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా ఉన్నాడు.సేనా దేశాల్లో ధోని బ్యాటింగ్‌ సగటు 28.37 కాగా.. రాహుల్‌ బ్యాటంగ్‌ సగటు 29.60గా ఉంది. గిల్‌ విషయానికొస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్‌ సగటు ధోని, రాహుల్‌ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్‌ టీమిండియా నయా టెస్ట్‌ కెప్టెన్‌గా నియమితుడైతే ధోని, రాహుల్‌తో పాటు పైన పేర్కొన్న చెత్త రికార్డును షేర్‌ చేసుకుంటాడు. టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్‌టెస్ట్‌ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన వారంలోపే విరాట్‌ కోహ్లి కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇవాళ (మే 12) ఉదయం కోహ్లి టెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రకటనను చేశాడు. బీసీసీఐలోని కొందరు పెద్దలు కోహ్లిని రిటైర్మెంట్‌ విషయంలో వెనక్కు తగ్గాలని కోరినా వినలేదని తెలుస్తుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. తాజాగా టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు.

Woman Selfie Video In Ntr District4
ఎన్టీఆర్‌ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది.

India And Pakistan Ceasefire DGMO Meeting Updates5
ముగిసిన భారత్‌-పాక్‌ DGMOల తొలిరౌండ్‌ చర్చలు

DGMO Meeting Updatesఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా భారత్‌-పాక్‌ దేశాల మధ్య తొలిదశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్‌ ద్వారా జరిపిన చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, పాకిస్తాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగింది. భారత్ తరపున సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు. ఉగ్రవాదులతోనే మా పోరాటం: అంతకుముందుకు ఆపరేషన్‌ సిందూర్‌పై త్రివిధ దళాల డీజీఎంవో (director general of military operations) మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీజీఎంవోలు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌కానీ పాకిస్తాన్‌ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్‌ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దేచర్చలు వాయిదా.. భారత్‌, పాకిస్తాన్‌ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్‌ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చర్చలు ప్రారంభం,హాట్‌లైన్‌లో భారత్‌, పాక్‌ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్‌ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.

US, China Reach Major Agreement On Tariffs6
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్

నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపైన చైనా విధించిన 125 శాతం సుంకాలలో 10 శాతం తగ్గించింది. అదే సమయంలో అమెరికా కూడా చైనా దిగుమతుల మీద విధించిన 145 శాతం సుంకాలలో 30 శాతం తగ్గించించింది.ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.

After Indian Army Military Operation, 17 New Born Girls Named Sindoor In UP7
ఆపరేషన్‌ సిందూర్‌ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!

టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్‌ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్‌ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

Mother and Partner Involved in Death of 10 Year Old Assam Boy8
తల్లే హంతకురాలు.. కొడుకుని ముక్కలు ముక్కులుగా నరికి.. సూట్కేస్‌లో కుక్కి

గౌహతి: ఓ అమ్మ పేగు బంధాన్ని తెంచుకుంది. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించిన ఆ తల్లి ప్రియుడి మోజులో పడి తన పదేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా కడతేర్చింది. కఠినాత్ములను సైతం కంటతడి పెట్టించే ఈ ఘటన అస్సాం రాష్ట్రం గౌహతిలో చోటు చేసుకుంది.గౌహతికి చెందిన దీపాలి రాజ్‌బోంగ్షి ఓ క్లీనిక్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమారుడు 10ఏళ్ల మృణ్మోయ్ బర్మన్‌ నవోదయ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో దీపాలి గౌహతి పోలీసుల్ని ఆశ్రయించింది. ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ స్క్రాప్‌ దుకాణం సమీపంలో అనుమానాస్పద సూట్కేస్‌ గురించి సమాచారం అందింది. స్క్రాప్‌ దుకాణం యజమాని ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్కేసును తెరిచి చూశారు. అంతే సూట్కేస్‌‌ లోపల ముక్కులు, ముక్కులగా ఉన్న మానవ శరీర భాగాల్ని చూసి కంగుతిన్నారు. ఫోరెన్సిక్‌ టీంను సైతం కేసులో ఇన్వాల్వ్‌ చేశారు.ఫోరెన్సిక్‌ టీం సేకరించిన ఆధారాలతో సూట్కేస్‌లో ఉన్నది బాలుడి శరీర భాగాలేనని నిర్ధారించారు. మరి బాలుడిని ఎవరు హత్య చేశారు? బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే దిశగా ఆరా తీశారు. ముందుగా బాలుడి కుటుంబంలో గొడవలే హత్యకు దారి తీశాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విచారించారు.అయితే విచారణలో తల్లి తీరుపై పోలీసులకు అనుమానం వేసింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఓ ప్రభుత్వ సంస్థలో తాత్కాలికంగా ప్యూన్‌గా పనిచేస్తున్న ప్రియుడు జ్యోతిర్మయి హలై కలిసి కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసిందని తేల్చారు.కొంతకాలం క్రితం దీపాలికి, జ్యోతిర్మయి హలైల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని దీపాలి నిశ్చయించుకుంది. రెండు నెలల క్రితం తన భర్తకు విడాకులిచ్చింది. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న కొడుకును కడతేర్చింది. చివరికి కటకటాలపాలైంది.

Heavy Rains Likely In Andhra Pradesh For Next Four Days9
ఏపీకి చల్లని కబురు.. నాలుగురోజుల పాటు విస్తార వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడగులు పడే ప్రమాదం ఉందని.. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల తీవ్రత ఉండన్నాయని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.కాగా, తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్‌ తక్కువగా నమోదయ్యాయి.అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశంం ఉంది.

Telugu Movies Streaming On OTT In May 3rd Week 202510
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే

మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement