
హైదరాబాద్, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికితోడు మరో రుతు పవన ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్రం అంతటా వానలు మొదలయ్యాయి. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి వాన మొదలైంది.
వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. చురుకుగా కదులుతోంది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఈ రాత్రిలోపు భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.
మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీలు, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4.2, దుగ్గొండిలో 4, భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.8 సెం.మీటర్ల వర్షం కురిసింది.

Comments
Please login to add a commentAdd a comment