హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన | Heavy Rain Lash Across Telangana And Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన

Published Fri, Aug 16 2024 6:12 PM | Last Updated on Fri, Aug 16 2024 9:31 PM

Heavy Rain Lash Across Telangana And Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకుని జడివాన కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 

 భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇచ్చారు.

హెల్ప్‌లైన్‌ నెంబర్స్‌ ఇవే:

040-21111111, 9000113667

నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, నిజాంపేట్‌, ప్రగతి నగర్, బాచుపల్లి, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 

మరోవైపు.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, జనజీవనం అస్తవ్యస్తమైంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement