
హైదరాబాద్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్‌లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు..
మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని అలర్ట్ ప్రకటించింది.
వర్ష సమస్యలపై కాల్ చేయండి
జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ : 040– 21 11 11 11
డయల్ 100 ∙ఈవీడీఎం కంట్రోల్‌రూమ్: 9000113667
మియాపూర్ పటేల్ చెరువుకు గండి
శేరిలింగంపల్లి: లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు వచ్చి చేరడంతో లింగంపల్లి నుంచి గచి్చ»ౌలి వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో వాహనదారులు లింగంపల్లి నుంచి లింగంపల్లి ఆర్‌ఓబీ మీదుగా గచి్చ»ౌలి వైపు వెళ్లారు. పటేల్‌చెరువుకు గండి పడటంతో కింది భాగంలో ఉన్న శ్రీరాంనగర్, శాంతినగర్, దీప్తీశ్రీనగర్ కాలనీల్లో వరద చేరింది.
లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
పురానాపూల్ బ్రిడ్జిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సందర్శించారు. జియాగూడలోని కేఎస్ స్వామి నగర్‌లోని లోతట్టు ప్రాంతవాసుల పరిస్థితిని సమీక్షించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట హైదరాబాద్ ఆర్టీఓ సూర్యప్రకా‹Ù, ఎమ్మార్వో జ్యోతి సంబంధిత అధికారులు ఉన్నారు.
నీట మునిగిన కాలనీలు..
భారీ వర్షంతో బస్తీలతో పాటు కొత్త కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. నాలాలు పొంగి ప్రవహించి బస్తీలపై ప్రభావం చూపాయి. చింతల్‌లోని గణేష్ నగర్, కల్పనాసొసైటీ, శ్రీనివాస్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. జీడిమెట్ల నుంచి వచ్చే కాలువ నిండి పొంగిపొర్లుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్,లింగంపల్లి, కూకట్‌పల్లి, మాదాపూర్, గచి్చ»ౌలి, రాయదుర్గం, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్, హయత్ నగర్, ప్రగతి నగర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్, బౌరంపేట్, సురారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజులరామారం, రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగి, మణికొండ, గండిపేట, బండ్లగూడ తదితర అన్నీ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సష్టించింది.
కుప్పకూలిన పురాతన భవనం
రాంగోపాల్‌పేట్: రెజిమెంటల్‌బజార్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 6 నెలల క్రితం జీహెచ్‌ఎంసీ అ«ధికారులు భవన యజమానిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ భవనం ఖాళీగా ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో భవనం ముందు భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే జీహెచ్‌ఎంసీ బేగంపేట సర్కిల్ ఏసీపీ కిష్టఫర్ చైన్‌మెన్లు ప్రకా‹Ù, నర్సింగ్‌రావు, జగదీష్, పాండులు అక్కడికి చేరుకుని చుట్టు పక్కల ఉండే వారిని అప్రమత్తం చేశారు. పురాతన భవనాలకు నోటీసులు జారీ చేశామని ప్రజలు జీహెచ్‌ఎంసీకి సహకరించాలని కోరారు. భవనాలు ఖాళీ చేయకపోతే తామే ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment