సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇక హైదరాబాద్‌కు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐంఎడీ.. ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది.
అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment