సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
కాగా, నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. నగరంలో మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
Had a Tele conference with all the Zonal Commissioners and EVDM Team. Instructed @GHMCOnline officials to be on high alert with out causing any inconvenience to public. Heavy rains are expected to continue over the city for 1 hour and later reduce. Citizens are advised to stay… pic.twitter.com/8DBj5BrvYQ
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) July 14, 2024
ఇక, కూకట్‌పల్లి, మూసాపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్,హైదర్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్, అమీర్‌పేట్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
#Hyderabad #Hyderabadrains pic.twitter.com/FP9wh1CvGQ
— Jagadish (@Jagadish_M) July 14, 2024
#Hyderabadrains!!
Now scattered heavy rains going in sanathanagar areas super rains for next 30min with gusty winds 🌧️ pic.twitter.com/JvHbX3iqmV— Telangana state Weatherman (@tharun25_t) July 14, 2024
Comments
Please login to add a commentAdd a comment