సాక్షి, మేడ్చల్: భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
మైసమ్మగుడలో కాలువలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు నీట మునగటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment