
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి రాజ్‌భవన్ వర్గాల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె.. ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, డీసీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు.
మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బాలిక ఇంట్లోకి దూరి మరీ ఆమె సోదరుడి ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి బ్యాచ్ అని, మత్తులోనే అఘాయిత్యానికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు.
ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమె కుటుంబానికి అవసరమైన అన్నివిధాల సహాయాన్ని వెంటనే అందించాలని గవర్నర్ సౌందరరాజన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment