Gang rape incident
-
మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి రాజ్‌భవన్ వర్గాల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె.. ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, డీసీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బాలిక ఇంట్లోకి దూరి మరీ ఆమె సోదరుడి ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి బ్యాచ్ అని, మత్తులోనే అఘాయిత్యానికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమె కుటుంబానికి అవసరమైన అన్నివిధాల సహాయాన్ని వెంటనే అందించాలని గవర్నర్ సౌందరరాజన్ ఆదేశించారు. -
స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్
రాంచి: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మానవ మృగాల చేతిలో అమాయకులు బలిపోతున్నారు. స్నేహితుడితో వెళ్లిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి చేసి 10 మంది గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు ట్రైబల్ కమ్యూనిటీకి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఆమెను సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఈ దారుణం అక్టోబర్ 20న జరిగింది. తన స్నేహితుడితో కలిసి సాయంత్రం 6 గంటలకు టెక్రాహటు ఎయిర్‌స్ట్రిప్‌కు బైక్‌పై వెళ్లింది. రోడ్డు పక్కన నిలబడి స్నేహితుడితో మాట్లాడుతోంది. అప్పుడే వారి వద్దకు 8-10 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఆమెతో ఉన్న వ్యక్తిని బెదిరించి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు పోలీసులు. ఆసుపత్రి వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఛాయ్‌బాసా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రాహటూ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న సబద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దిలీప్ ఖల్కో, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ పతాక్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉండే కొంత మంది యువతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: వీడియో: భారీగా ఊగిపోయిన విమానం.. ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయ్! -
గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సీరియస్
హైదరాబాద్ : చల్లూరు గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళుతున్న కార్మికుల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ వెబ్ సైట్‌ను నాయిని ఆవిష్కరించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భంగా మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది ఐదు వేల మందిని విదేశాలకు పంపుతామని మంత్రి తెలిపారు.