హైదరాబాద్ : చల్లూరు గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళుతున్న కార్మికుల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ వెబ్ సైట్ను నాయిని ఆవిష్కరించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భంగా మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది ఐదు వేల మందిని విదేశాలకు పంపుతామని మంత్రి తెలిపారు.
గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సీరియస్
Published Tue, Mar 1 2016 5:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement