
సాక్షి, హైదరాబాద్ : మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేలుడు కలకలం రేపింది. విజయపురి కాలనీలో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురి కాలనీలో చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సమీపంలో డబ్బా దొరికింది. దీంతో ఆమె డబ్బాను తెరిచేందుకు యత్నించింది. అయితే డబ్బా తెరుచుకోకపోవడంతో.. దానిని నేలకేసి కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్త ఏరకునే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని డబ్బాను స్వాధీనం చేసుకుని క్లూస్ టీమ్‌కు అప్పగించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. బాంబ్ స్కాడ్ కూడా మరికాసేపట్లో ఘటన స్థలానికి చేరుకోనుంది. గతంలో శివరాంపల్లిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్ దగ్గర ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చెత్త ఏరకునే వ్యక్తి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment