విశాల్ (ఫైల్)
సాక్షి, మీర్‌పేట: ఆర్థిక ఇబ్బందులు... ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహేశ్వరానికి చెందిన స్మిత భర్త సంతోష్‌కుమార్ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి నాలుగేళ్లుగా బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో అద్దెకు ఉంటోంది. పెద్ద కుమారుడు వరుణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు విశాల్ (20) ఇంటర్ పూర్తి చేసి బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి ఉద్యోగం వేట మొదలుపెట్టాడు.
చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో విశాల్ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనసస్థాపం చెందిన విశాల్ బుధవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న తరువాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం గురించి ఉద్యోగం విశాల్ తరచు కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉండేవాడని.. మన కుటుంబ పరిస్థితి ఇలా ఎందుకు ఉందని ఆవేదనకు గురయ్యేవాడని కుటుంబసభ్యులు విలపించారు. ఈ క్రమంలోనే ఉద్యోగం రాకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై విశాల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు.
చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment